Gandhi Bhavan | రుణమాఫీ కాలేదంటూ.. గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా..
Gandhi Bhavan | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి మాటలు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి మాటలు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో.. రేవంత్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారు. అవకాశం ఉన్న చోట రైతులు నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఓ వృద్ధ రైతు.. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని ధర్నాకు దిగాడు. తనకు రుణమాఫీ చేసే వరకు ఇక్కడ్నుంచి కదిలేది లేదని ఆ రైతు తేల్చిచెప్పాడు. తన పేరు తోట యాదగిరి శాలిగౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గం.. 55 క్వింటాళ్ల 80 కిలోల ధాన్యాన్ని విక్రయించాను. కానీ ఇప్పటి వరకు బోనస్ రాలేదు. అంతే కా...