అణగారిని వర్గాల ఆశాజ్యోతి
నిఖార్సయిన దళితబంధు..బాబూ జగ్జీవన్ రామ్
వరంగల్ వాయిస్,పాట్నా: బాబుజీగా ప్రసిద్ది చెందిన జగ్జీవన్ రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళితబంధుగా చెప్పుకోవాలి. చరణ్‌సింగ్ తరవాత ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా ఎందుకనో ఆనాటి పరిస్థితులు అనుకూలించలేదు. అలా జరిగివుంటే ఓ దళితుడు దేశ ప్రధాని అయ్యారన్న చరిత్ర ఉండేది. ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ పుట్టారు. ఆయన తండ్రి శోబీరామ్, తల్లి వసంతిదేవి. బీహార్‌లోని షాహాబాద్( ఇప్పుడు భోజ్‌పూర్) జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. ఆయనకు అన్నయ్య సంత్ లాల్ తోపాటు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. మాజీ స్పీకర్ విూరా కుమార్ స్వయాన ఆయన కూతురే. 1936`1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు. అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరైన అతను ...