75 ఏండ్ల స్వాతంత్ర భారతం.. దక్కని స్వాతంత్య్ర ఫలం
దుర్విచక్షణ, అసమానతలను అధిగమించి దేశీయంగా ప్రగతి సాధించబడాలనేది రాజ్యాంగ నిర్మాతల అభిమతం. కానీ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్నా అది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారతీయుల సగటు ఆయుర్ధాయాన్ని నేటికీ కూడా కులమే నిర్దేశిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అధ్యయనం అగ్రవర్ణాలతో పోలిస్తే.. ఎస్సీ, ఎస్టీల జీవిత కాలంలో నాలుగు నుంచి ఆరేండ్లు తగ్గుదలగా ఉన్నట్లుగా చెబుతున్నది. ఆయా సామాజిక వర్గాల సగటు ఆయుఃప్రమాణంతో 20 ఏండ్ల క్రితం 4.6 సంవత్సరాల తేడా ఉంటే 2016 నాటికి అది 6, 1కి పెరిగింది. ప్రజారోగ్యాన్ని ప్రోదిచేయడం ప్రభుత్వాలు, పాలకుల కర్తవ్యం అని 47వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తున్నది. కానీ ఈ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచడం లేదు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందాలని 1946లోనే భోర్ కమిటీ సూచించింది. ప్రత...