Maha Kumbh | ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ‘మహా’రద్దీ.. 37 రోజుల్లో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు
Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మేళా మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తాకిడి పెరిగింది. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకూ 69 లక్షల మంది నదీ స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ డేటా ప్రకారం.. మొత్తంగా 37 రోజుల్లో 55.31 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. కాగా, వారాంతం తర్వాత రద్దీ తగ్గుతుందని అంతా భావించారు.. అయితే, సోమవారం ఒక్కరోజే ఏకంగా కోటి మందికి పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చార...
