Warangalvoice

Tag: సాయంలోనూ తగ్గేదేలే..

సాయంలోనూ తగ్గేదేలే..
District News, Telangana, Viral News

సాయంలోనూ తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ ఔదార్యం.. డ్రైవర్ ఇంటి నిర్మాణానికి రూ.15లక్షల సాయం కమలాపూర్ వాసి, డ్రైవర్ మహిపాల్ ఇంట విరిసిన ఆనందం వరంగల్ వాయిస్, హనుమకొండ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. పాన్ ఇండియా లెవల్ లో తగ్గేదేలే.. అనే నటనతో ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. మెగా కంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డాన్స్ , డైలాగ్ డెలివరీలో తనదైన మార్క్ చూపించుకుంటున్నాడు. సినిమా సినిమాకు తన కెరీర్ ను ఉన్నతంగా మలుచుకుంటున్నాడు. ఐకాన్ స్టార్ గా వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అయితే ఈ అల్లు వారి అబ్బాయి.. నటుడిగానే కాకుండా రియల్ లైఫ్ తన మంచి మనస్సుతో అందరినీ హృదయాలను ఆకట్టుకుంటున్నాడు. అభిమానులతో పాటు తన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా సొంతింటి వారిలాగా చూసుకోవడం ఆయనకే చెల్లింది. తాను మాత్రమే బాగుండడం కాదు.. తన దగ్గర పనిచేసేవాళ్లు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్త...