వారెవ్వ.. తగ్గేదే లే పుష్ప.. పుష్పరాజ్
సినిమా లెవెలెల్లో గంజాయి స్మగ్లింగ్
గంజాయి స్మగ్లర్ అరెస్ట్
భారీగా పట్టుబడిన గంజాయి
యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసుల చొరవ
రూ.85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయి, ట్రాక్టర్ పోలీసులు స్వాధీనం
పోలీస్ సిబ్బందిని ప్రశంసించిన సిపి అంబర్ కిషోర్ షా
వరంగల్ వాయిస్, క్రైం : అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా దేశవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో మనందరికి తెలిసిందే.. అందులో ఎర్ర చెందనం చెక్కల అక్రమ రవాణా ఎలా చేయవచ్చో.. అటవీ అధికారుల కళ్లు గప్పి స్మగ్లింగ్ ఎలా చేయాలో తెలివిగా పోలీసులను ఎలా బురిడీ కొట్టించవచ్చో చాల చక్కగా చూపించారు. బహుషా ఆ సీనిమాను స్పూర్తగా తీసుకున్నట్టున్నారు ఈ గంజా అక్రమ రవాణా దారులు. మొత్తం సినిమాలో చూపించి నట్టుగా ట్రాక్టర్ లో స్మగ్లింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు పాలు పాడుతున్న ఓ ముఠా తాజా పోలీసులకు పట్టు పడ్డారు.. పోలీసులు తెలిపిని వివరాల ...