వన్యప్రాణుల సంరక్షణకు ప్రధాన్యం
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్ వాయిస్, వరంగల్ : అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యాతనివ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఛైర్మన్ శ్రీమతి కొండా సురేఖ అధ్యక్షతన ఏడవ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, పిసిసిఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎం సి పర్గెయిన్, ఫీల్డ్ డైరక్టర్ లు క్షితిజ, శాంతారాం, బోర్డు అధికారులు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆర్ అండ్ బి, పంచాయతీ, పశుసంవర్ధక శాఖ అధికారులు, బిసిఎన్ఎల్, టి ఫైబర్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు చేశారు. మా...