బీసీల ప్రత్యేక రాజకీయ పార్టీ రావాలి
రాజకీయ చైతన్యంకై గ్రామాలకు తరలాలి
స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్ల గెలుపుకై బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కృషి
బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు
వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సమాజ విముక్తి కోసం రాజ్యాధికారం అవసరమని, రాజకీయ చైతన్యం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని బీసీ ఇంటలెక్టువల్ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.చిరంజీవులు అన్నారు. భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ 102వ జయంతి సందర్భంగా "స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల పాత్ర" అనే అంశంపై హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కోసం ఉద్యమిస్తున్న బీసీలు దోపిడీ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలను వీడాలని పిలుపునిచ్చారు. బీసీల ఓట్లు...