బాలుడి గొంతు కోసిన దుండగులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న ఏడేళ్ల బాలుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన చెందిన ఉపేందర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించారు. ఈ క్రమంలో తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో తండ్రితో కలిసి నిద్రిస్తున్న ఉపేందర్ కుమారుడిపై దుండగులు కత్తితో దాడి చేసి మెడను కోసి అక్కడినుంచి పరారయ్యారు. దీన్ని గమనించిన బాలుడి నానమ్మ ఇంట్లో వారిని నిద్ర లేపారు. రక్తస్రావం అవుతున్న బాలుడిని స్థానిక వైద్యుడి వద్ద ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ప్రమాదం లేదని తెలిపారు. ఈ దంపతుల చిన్న కుమారు...