Warangalvoice

Tag: త్యాగరాజ కీర్తనలను ఆలపించిన కలెక్టర్

త్యాగరాజ కీర్తనలను ఆలపించిన కలెక్టర్
Cultural

త్యాగరాజ కీర్తనలను ఆలపించిన కలెక్టర్

ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన పి.ప్రావీణ్య వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్రం ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి సంగీత, నృత్య కార్యక్రమాల్ని నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులతో పాటు స్థానిక కళాకారులు, కళాశాల అధ్యాపక బృందంతో కలిసి త్యాగరాజ కీర్తనను ఆలపించారు. స్థానిక కళాకారులతో పాటు హైదరాబాద్ కు చెందిన కళాకారులు త్యాగరాజ కీర్తనలను ఆలపించి సంగీత అభిమానులను అలరింపజేశారు. విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న కళాకారులందరికీ జిల్లా కలెక్టర్ ప్రావీ...