Warangalvoice

Tag: కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి

కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి
District News, Hanamkonda

కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి

అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చిన వ్యక్తి ఆయన జీవన విధానం ఆదర్శప్రాయం వరంగల్ వాయిస్, హసన్ పర్తి : మూడు దశాబ్దాలు ఉత్తమ సేవలు అందించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు కోతి ఎల్లయ అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చాడని హసన్ పర్తి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇన్నంశెట్టి సుమాదేవి అన్నారు. ఆయన జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో 30 ఏళ్లు పనిచేసి హసన్ పర్తి బాలికల హైస్కూల్లో ఉద్యోగ విరమణ పొందిన కోతి ఎల్లయ్యకు సోమవారం అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమాదేవి మాట్లాడుతూ సమయపాలన పాటించడంతో పాటు విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడంలో ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ జి.శివకుమార్, చిన్ననాటి మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ స్వయంకృషితో పైకి ఎదిగిన ఎల్లయ్య సేవలను కొనియాడారు. అన్నారం...