కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అత్యంత ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా ఉద్యోగినులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల వేడుకల్లో పాల్గొని అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగినులు వారి పిల్లలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆటపాటల మధ్య అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి.మహిళలు బతకమ్మ పాటలకు చేసిన నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో మహిళల్ని శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనదన్నారు. పువ్వులను దేవతలుగా పూజించే గొప్ప పండుగ ప్రపంచంలో ఒక్క ...