అమ్మ బాబోయ్.. 120 చలాన్లు..!
ద్విచక్ర వాహనం స్వాధీనంవరంగల్ వాయిస్, కాజీపేట : వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలిసి బుధవారం కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన వాహనదారుడి ద్విచక్రవాహనానికి సంబంధించిన వివరాలను పరిశీలించగా ఏకంగా 120 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ అధికారులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. ఈ చలాన్ల మొత్తం రూ.32,165 కావడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జరిమానా మొత్తం చెల్లిస్తేనే వాహనం రిలీజ్ చేయనున్నట్లు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న చెప్పారు....