అభివృద్ధి, సంక్షేమంలో మనమే నంబర్ వన్
8ఏండ్లలోనే అద్భుత తెలంగాణఉద్యమ నేతే సీఎం కావడం రాష్ట్రానికి వరంకేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంఅభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదుసంపద పెంచు, అందరికీపంచు అనే పద్ధతిలో పాలనవరంగల్ సమగ్ర అభ్యున్నతికి ఎన్నో పథకాలుమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రం ఊహకు కూడా అందని ఆదర్శవంతమైన పథకాల అమలుతో తెలంగాణ అగ్రగామిగా దూసుకెళుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఖిలా వరంగల్ కోటలో జెండా ఆవిష్కరించి వేడుకల్లో మాట్లాడారు.. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి, సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సమర్థవంతంగా పరిపాలన సాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 8ఏండ్లలోనే అద్భుత విజయాలు సాధించడం మనందరికీ గర్వకారణమన్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్య...