Warangalvoice

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పీడీయాక్ట్

వరంగల్ వాయిస్, క్రైం: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాటు ఉద్యోగాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగుల వద్ద డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న గుంటూరు జిల్లా పట్టాబిపురానికి చెందిన ఎస్.కె.గౌస్, పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ నిందితుడు గౌస్ కు వరంగల్ రైల్వే స్టేషన్లో వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసి చర్లపల్లి కారాగారానికి తరలించారు.
పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులను నమ్మించడం ప్రారంభించి.. సంబంధిత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు రూ.8లక్షల నుంచి 20 లక్షల్లో డబ్బు వసూలు చేసిన సంఘటనలో నిందితుడిని మీల్స్ కాలనీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు జూన్ 27వ తేదిన అరెస్ట్ చేసిన అతడి నుంచి 20లక్షల50వేల నగదు, ఒక ఖరీదైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ చట్టవ్యతిరేక కార్య కలపాలకు పాల్పడే వ్యకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

PD Act against a person who commits fraud in the name of employment
PD Act against a person who commits fraud in the name of employment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *