Warangalvoice

Mukra Villagers | ముక్రా(కె) మరోసారి ఆదర్శం.. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు గ్రామస్థుల విరాళం

  • బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే నేడు బీఆర్‌ఎస్‌ వేడుకల నిర్వహణకు గాను స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది.

వరంగల్ వాయిస్, ఆదిలాబాద్ : బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే నేడు బీఆర్‌ఎస్‌ వేడుకల నిర్వహణకు గాను స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా ( కే )  గ్రామస్థులు ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ.1,02,003 విరాళాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  కు అందజేయాలని నిర్ణయించారు.

సోమవారం మాజీ సర్పంచ్ మీనాక్షి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఇంటింటికి విరాళాలు సేకరించారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో గ్రామంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని గ్రామస్తులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఫలితంగా తమకు ఉపాధి ఎంతో మెరుగుపడిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉన్న తాము వరంగల్ సభకు అందరం వెళ్తామని నిర్ణయించారు.

Mukrak Is An Ideal Once Again Villagers Donate To Brs Silver Jubilee Celebration
Mukrak Is An Ideal Once Again Villagers Donate To Brs Silver Jubilee Celebration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *