Warangalvoice

MLC Kavitha | ఎంఎంటీఎస్ రైలులో యువ‌తిపై అత్యాచార‌య‌త్నం.. ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి

  • ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలులో యువతిపై అత్యాచార‌య‌త్నం ఘ‌ట‌నపై క‌విత‌ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. తనను రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీ వ‌ద్ద‌ ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని.. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తాము పదేపదే చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని క‌విత‌ డిమాండ్ చేశారు.

Brs Mlc Kavitha Condolence To Woman Molest In Mmts Train
Brs Mlc Kavitha Condolence To Woman Molest In Mmts Train

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *