Warangalvoice

KTR | ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగితే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్

  • ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స‌వాల్ విసిరారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స‌వాల్ విసిరారు. శాస‌న‌స‌భ‌లో రుణ‌మాఫీ, రైతుబంధు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. 18 గంట‌లు ప‌ని చేస్తున్నాన‌ని సీఎం చెబుతున్నాడు. ఒక్క రోజు సెలవు పెట్ట‌కుండా బ్ర‌హ్మాండంగా ప‌ని చేస్తున్నాను. 40 సార్లు కాక‌పోతే 400 సార్లు ఢిల్లీకి పోతా అంటున్న‌డు.. వెళ్లండి.. నిన్ను ఎవ‌రు వ‌ద్ద‌న్న‌రు. బ్ర‌హ్మాండంగా తిరుగు. దావోస్ నుంచి పెట్టుబ‌డులు త‌న్నుకు వ‌స్తున్నాయి.. సంక్షేమం అద్భుతం.. ఐదు గ్యారెంటీలు అయిపోయాయి అని మాట్లాడుతున్నారు. మ‌రి ఎందుకు 71 వేల కోట్ల అంచ‌నాలు త‌గ్గింద‌ని స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో మాట్లాడిన‌వ్ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఆరు గ్యారెంటీల‌కు, ఉద్యోగుల‌కు డీఏ, తులం బంగారానికి పైస‌ల్లేవు. కానీ ఫ్యూచ‌ర్ సిటీ, మూసీ అభివృద్ధి ఇత‌ర‌త్రా వాటికి పైస‌లు ఉంటాయి అంటున్నాడు. రుణ‌మాఫీ రుణ‌మాఫీ అంటున్న‌రు సీఎం. రుణ‌మాఫీపై సీఎంను సూటిగా అడుగుత‌న్నా.. రేపు ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్దాం.. కొడంగ‌ల్, సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏ గ్రామానికైనా వెళ్దాం. ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ అయింద‌ని చెబితే శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి వెళ్లిపోతాను. ఇది నా ఛాలెంజ్. స్వీక‌రిస్తారా..? కొండారెడ్డిప‌ల్లె కూడా పోదాం.. రైతుల‌ను రెచ్చ‌గొట్టి 2 ల‌క్ష‌ల రుణాలు తెచ్చుకోవాల‌న్నాడు. కానీ ఇంత వ‌ర‌కు రుణ‌మాఫీ కాలేదు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు.. దేవుళ్లు కూడా బాధ‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

రైతుబంధును ఆపిందే నాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రూ. 7600 కోట్లు రేవంత్ రెడ్డి ఆపి హ‌రీశ్‌రావు, కేసీఆర్ ఆపుతున్నాడ‌ని అన్నారు. ఉచిత క‌రెంట్ అంటే కాంగ్రెస్ అన్నారు. మా నాన్న చనిపోతే క‌రెంట్ లేదు చెప్పిందే రేవంత్ రెడ్డినే క‌దా..? 100 రోజులు ఆరు గ్యారెంటీలు అని చెప్పింది మీరే క‌దా..? ఎందుకు తులం బంగారం ఇస్త‌లేరు. గోల్డ్ అనుకున్నారు కానీ రోల్డ్ గోల్డ్ అని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. ఆర్థిక అరాచ‌క‌త్వం నిజ‌మైతే.. అదే అధికారుల‌ను ఎందుకు కొన‌సాగిస్తున్నారు అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Brs Mla Ktr Gave Challenge To Cm Revanth Reddy On Crop Loans
Brs Mla Ktr Gave Challenge To Cm Revanth Reddy On Crop Loans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *