Warangalvoice

అనుమానం.. రెండు ప్రాణాలు బలి

  • భార్యను నరికి చంపిన భర్త
  • ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్య
  • రెండు నెలల కిందటే వివాహం
  • ఆత్మకూరు మండల కేంద్రంలో విషాదం

వరంగల్ వాయిస్, ఆత్మకూరు: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితమే భార్యతో గొడవపడిన హరీష్‌ క్రిమిసంహారక మందు తాగాడు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకొని ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. అయితే మరోసారి భార్యాభర్తల మధ్య ఇదే విషయమై వివాదం జరిగింది. దీంతో కోపోద్రోక్తుడైన భర్త హరీష్‌ మంగళవారం తెల్లవారుజామున భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Doubt.. Two lives were sacrificed
Doubt.. Two lives were sacrificed

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *