Warangalvoice

Warangal

వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు
District News, Warangal

వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు

వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలతో వీఆర్ఏల జాక్ తో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. పే స్కేల్ ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని దుయ్యపట్టారు. సమ్మెలో పాల్గొన్న బీజేపీ నాయకులు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు చిల్లర నర్సింగ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ చాంద్ పాషా, 2వ డివిజన్ అధ్యక్షుడు భగవాన్ దాస్ ఉపాధ్యాయ, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోవెల జీవన్, ప్రకాష్, జయంతి లాల్, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు కందకట్ల సత్యనారాయణ, గుంటి కుమార్ స్వామి, ఆర్ శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రవణ్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు....
స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?
District News, Hanamkonda, Top Stories, Warangal

స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?

న‌గ‌రంలో 121 ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లునేటికీ ముందుకు ప‌డ‌ని అడుగులుఇబ్బందులో ప్ర‌జ‌లుమొద్దునిద్ర‌లో బ‌ల్దియా అధికారులు రాష్ట్రంలో రెండో అతి పెద్ద న‌గ‌రంగా అభివృద్ధి చెందుతున్న వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌రాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు పాల‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు నీటి మూట‌లుగా మారుతున్నాయి. అధికారుల అల‌స‌త్వం, పాల‌కులు ప‌ట్టింపులేని త‌నంతో న‌గ‌రం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెన‌క్కి వెళ్తోంది. న‌గరంలో నూత‌నంగా చేప‌ట్టాల్సిన ఎన్నో ప‌థ‌కాలు కేవ‌లం కాగితాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. ఇదే బాట‌లో న‌గ‌రంలో స్మార్ట్ బ‌స్ షెల్ట‌ర్‌ల నిర్మాణ ప్ర‌క్రియ‌ను కూడా బుట్ట‌దాఖ‌లు చేశారు. దీంతో పాత‌కాల‌పు నాటి బ‌స్ షెల్ట‌ర్‌తోనే న‌గ‌ర ప్ర‌జ‌లు స‌ర్దుకోవాల్సి వస్తోంది. న‌గ‌రంలో మోడ్రన్ బ‌స్ షెల్ట‌ర్‌ల నిర్మాణం ఎప్పుడు చేస్తారో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి న...
సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే
District News, Hanamkonda, Top Stories, Warangal

సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే

గ్రేటర్‌లో సగానికిపైగా మహిళా ప్రతినిధులేవీరిలో చాలా మంది వంటింటికే పరిమితంరాజకీయంగా చక్రం తిప్పుతున్న పతులుఅధికారిక కార్యక్రమాల్లోనూ వారేప్రకటనల్లోనూ భార్య పేరు పక్కనే భర్త పేరుఅయోమయానికి గురవుతున్న జనం మహిళా సాధికారత కేవలం కాగితాలకే పరిమితమైంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నప్పటికీ చక్రం తిప్పేది మాత్రం పురుషులే. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్లు మహిళల జీవితాల్లో మార్పు తేవడం లేదు. చట్టసభల్లోనూ వారు భర్తల కనుసన్నల్లోనే నడుచుకుంటున్నారు. భర్త ఎస్‌ అంటే ఎస్‌ అని నో అంటే నో అంటూ వ్యవహరిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు సైతం పతులే హాజరవుతున్నారు. సతులు గడప దాటకుండా కేవలం అధికారిక పత్రాలపై ఆటోగ్రాఫ్‌లకే పరిమితమవుతుండగా పతులు మాత్రం పొద్దున లేచింది మొదలు పొద్దుపోయే వరకు రాజకీయంగా చక్రం తిప్పుతూ హడావిడి సృష్టిస్తున్నారు. కొంతమంది భర్తలు ఇంకొంచెం ముందడుగు ...
వీఆర్ఏలు సమస్యలు పరిష్కరించండి
District News, Warangal

వీఆర్ఏలు సమస్యలు పరిష్కరించండి

వరంగల్ వాయిస్, నర్సంపేట : వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి కి నిరసనగా తహసీల్దార్ కార్యాలయంలో 2వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల వీఆర్వో సంఘం సంఘీభావం తెలుపారు. సమ్మెను ఉద్దెశించి వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, కౌన్సిలర్ వేముల సాంబయ్య మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలు న్యాయమైనవి, వారికి పే స్కేల్ జీవో వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో ల సంఘం నాయకులు రాజేందర్, రాజు, నర్సింహస్వామి, వీఆర్ఏల జేఏసీ చైర్మన్ బిర్రు సునిల్, వీఆర్ఏలు పాల్గొన్నారు పాల్గొన్నారు....
గొర్రెల, మేకల అనారోగ్య నివారణకు వ్యాక్సిన్
District News, Warangal

గొర్రెల, మేకల అనారోగ్య నివారణకు వ్యాక్సిన్

వరంగల్ వాయిస్, వరంగల్ : గొర్రెలు, మేకలు అనారోగ్య నివారణకు, నీలి నాలుక వ్యాధిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా బ్లుటంగ్ వాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం వేయించడం జరుగుతుందని, దీన్ని గొర్రెలు, మేకల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. పశు వైద్యశాల డాక్టర్ ఝాన్సీ అధ్వర్యంలో శుక్రవారం ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు మందులను పంపిణీ చేసి, గొర్రెలకు ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలోని పశు సంపద గొర్రెలు, మేకలు పెంపకానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య. హసీనా, వినయ్, గొట్టే రాజమ్మ, పిట్ట శ్రీనివాస్, సుంకరి నరేష్ ఉన్నారు....