Warangalvoice

Warangal

ర‌హ‌దారి మరమ్మతులు చేయండి
District News, Warangal

ర‌హ‌దారి మరమ్మతులు చేయండి

హైదరాబాద్‌లో రోడ్లు, భ‌వ‌నాల చీఫ్ ఇంజనీర్‌కు గంట రవికుమార్ వినతివ‌రంగ‌ల్ వాయిస్‌, వ‌రంగ‌ల్ : గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారిన వరంగల్ బట్టల బజార్ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు ఇత‌ర ఆర్ అండ్ బీ ర‌హ‌దారుల మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నేత గంట రవికుమార్ కోరారు. ఈ మేర‌కు హైదరాబాద్‌లో సోమవారం ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ (రోడ్స్ అండ్ సీ ఆర్ ఎన్) పి.రవీందర్ రావు, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్(అడ్మినిస్ట్రేషన్) పింగళి సతీష్ లను కలిసి రోడ్ల దుస్థితిని తెలిపే ఛాయా చిత్రాలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. అనంతరం గంట రవి కుమార్ మాట్లాడతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి అడుగడుగునా గుంతలమయంగా మారి, ప్రమాదాలు జరుగతున్నాయంటూ వారికి వివరించినట్టు పేర్కొన్నారు. వరంగల్ మహానగరం రోడ్ల దుస్థితిపై చర్చించినట్టు తెలిపారు. వాల్ మార్ట్ నుంచి రంగశాయిపేట్ మీదుగా ఖిలా వరంగల్ కోట రోడ్డు డివైడర్ పనులు పూర్తికాక ప్రజలు తీవ్ర...
కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..
Crime, District News, Warangal

కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్రూ.13లక్షల విలువ చేసే బైక్ ల స్వాధీనంవివరాలు వెల్లడించిన తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను శనివారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 13 లక్షల విలువ గల ఎనిమిది ఖరీదైన ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతానికి చెందిన షిండే జితేందర్, షిండే అశోక్ తో పాటు హనుమకొండ జిల్లా పద్మాక్షీ ప్రాంతానికి చెందిన షిండే ఈశ్వర్ ముగ్గురు వరుసకు అన్నాదమ్ములు కావడంతో వీరు తరుచుగా కలుసుకునేవారు. ఇదే సమయంలో నిందితులు ముగ్గురు కలిసి మద్యం తాగడంతో పాటు జల్సాలు చేసేవారు. దీంతో వీరు చేసే చిన్న చిన్న పనుల కారణంగా వీరికి వచ్చే అదాయం వీరి జల్సాల...
నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి
Crime, District News, Warangal

నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: నేరస్థులకు పట్టుకోనేందుకుగాను పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. ఆర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా పోలీసు కమిషనర్ ముందుగా డ్రైవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలపై నేరాలు, మిస్సింగ్, ఎన్.డి.పి.ఎస్, చిట్ ఫండ్, రోడ్డు ప్రమాదాలు, ఈ. పెట్టి కేసులకు సంబంధించి గత ఏడాదికి , ఈ సంవత్సరంలో గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన కేసుల వ్యత్యాసాలపై సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి విశ్లేషించారు. అనంతరం ప్రస్తుతం నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్ , కేసుల దర్యాప్తు , రికవరీ,...
తన భూమి.. ధరణిలో వేరొకరి పేరుతో..
Crime, District News, Warangal

తన భూమి.. ధరణిలో వేరొకరి పేరుతో..

ఆవేదనతో అనారోగ్యం బారిన పడి వ్యక్తి మృతి వరంగల్ వాయిస్, ఆరెపల్లి: తన భూమి ధరణి సైట్ లో మరొకరిపై పేరు రావడంతో ఆవేదనతో అనారోగ్యం బారిన పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ జిల్లాలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన పొగాకు మహేందర్ గౌడ్ గ్రామ గౌడ కుల పెద్దమనిషి. తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నెం 565 లో 0.17 గుంటల భూమి ధరణిలో అదే గ్రామానికి చెందిన ఇతరుల పేరుపై రావడంతో గత సంవత్సరం నుంచి తహసీల్దార్ , కలెక్టర్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి తన అనారోగ్యం క్షీణించి చివరగా శుక్రవారం మృతి చెందాడు. మహేందర్ తనకు స్వార్జితమైన భూమి తనకు దక్కాలని, ఇద్దరు కూతుర్లకు అందాలని నిత్యం మధన పడుతూ అనారోగ్యానికి గురై చనిపోవడం బాధాకరం అని , ధరణి తప్పిదం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే పొగాకు మహేందర్ మృతి చెందాడని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పొగాకు మహేందర్ కు ఉండబడిన భూమిని తక్షణమే పట్టాకు ఎక్కించి, రైతు...
హ‌ద్దు మీరొద్దు
District News, Political, Warangal

హ‌ద్దు మీరొద్దు

పార్టీ క్యాడ‌ర్‌కు ఎమ్మెల్యే చ‌ల్లా హెచ్చ‌రిక‌విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై సీరియ‌స్‌ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐదుగురిపై చ‌ర్య‌లుజ‌వాబుదారిత‌నంగా వ్య‌వ‌హ‌రించాలంటూ హిత‌వుప‌ర‌కాల‌లో తిరిగి గులాబీ జెండా ఎగురేసేందుకు కృషి చేయాలి ‘‘ప్ర‌జా సేవే ల‌క్ష్యంగా పార్టీ క్యాడ‌ర్ ముందుకు సాగాలి.. ప్ర‌తీ ఒక్క‌రు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిత‌నంగా వ్య‌వ‌హ‌రిస్తూ వారి అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలి.. ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ప‌ర‌కాల‌లో తిరిగి గెలిపించేందుకు కృషి చేయాలి.. వివాదాల్లో త‌ల‌దూర్చుతూ హ‌ద్దు మీరి వ్య‌వ‌హ‌రిస్తే వేటు త‌ప్ప‌దు..పార్టీ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదు.. పార్టీలో ప‌ట్టప‌గ్గాలు లేకుండా వ్య‌వ‌హ‌రించేవారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు..’’ అంటూ ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారావు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలిసింది. ప‌ర‌కాల ...
బాధితుడికి ఆర్థిక సాయం అందజేత
District News, Warangal

బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ ఐఏఎస్ సహకారంతో గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో దొంతూరి సమ్మయ్య గౌడ్, ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో బాల్నే రాజు గౌడ్ ఇటీవల గీత వృత్తి చేసుకుంటూ ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుంచి పడి నడుము విరగగా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15000 చెక్కులను బుర్రా వెంకటేష్ గౌడ్ పంపించారు. హనుమకొండ జిల్లా బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ కందాల శంకరయ్య గౌడ్ తో కలిసి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొనగాని యాదగిరి గౌడ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నారగోని కుమారస్వామి గౌడ్, గ్రేటర్ వరంగల్ గోపా అధ్యక్షుడు పులి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జనగాం వెంకటేశ్వర్లు గౌడ్, ఐనవోలు మండల అధ్యక్షులు పట్టాపురం ఎల్లా గౌడ్, బత్తిని నాగరాజు గౌడ్, గడ్డం రమేష్ గౌడ్ లు అందించారు. అనంతరం...
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల
District News, Warangal

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల

ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించండి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఎంఎస్ కార్యాలయంలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు కొనసాగాలంటే, జనాభా దామాష ప్రకారం బీసీల వాటా బీసీలకు దక్కాలంటే బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలని, జనాభాలో 55 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్ప...
కంచాలు అందజేత
Warangal

కంచాలు అందజేత

వరంగల్ వాయిస్, వరంగల్ : శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైద్రాబాద్ జిల్లాలో మసాబ్ టాంక్, బంజారాహిల్స్ బాలబడి చిన్నారులకు స్టీల్ కంచాలు, గ్లాసులను శ్రీ మామిడి భీం రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలు కరుణ, సుజాత, శారద, వనజ, పద్మ సహకరించారు. విజయ్, జేవీర్ సింగ్, నిర్మల,అనురాధ,విజయ,లక్ష్మి పాల్గొన్నారు....
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ
Bhupalapally, District News, Warangal

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో ఇటీవల మరణించిన పలు బాధిత కుటుంబాలను గురువారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. ప్రకాశరెడ్డిపేటలో గాదె పాపిరెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పోస్టల్ కాలనీలో సూరవు దయాకర్ రావు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరికొండ మధుసూదనాచారి వెంట 50వ డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్, కార్యకర్తలు ఉన్నారు....
కేంద్రం కేటాయించిన నిధులపై ఆర్టీఐ దరఖాస్తు
District News, Warangal

కేంద్రం కేటాయించిన నిధులపై ఆర్టీఐ దరఖాస్తు

వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి రాజ్యలక్ష్మి, మండల పంచాయతీ అధికారి ధనలక్ష్మి కిసమాచార హక్కు చట్టం ద్వారా మండల పరిషత్, మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు వినియోగానికి సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్షాన మాజీ శాసనసభ్యుడు నల్లూరి ఇంద్రసేనారెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఆయా మండల పరిధిలో గల గ్రామాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014-15వ ఆర్థిక సంవత్సరం నుంచి జూన్ 30 2022 ఆర్థిక సంవత్సరం వరకు ఏమేం నిధులు కేటాయించాయి, వాటి వినియోగం ఏ విధంగా జరిగింది అనే అంశాలను ప్రాతిపదికన సమాచార సేకరణ కోసం ప్రతి మండలానికి ఈ దరఖా...