బిఆర్‌ఎస్ బెదరింపులకు భయపడేది లేదు
దాడులు చేస్తే రెట్టింపు స్థాయిలో ప్రశ్నిస్తాం
వైఎస్ షర్మిల విమర్శలు
వరంగల్ వాయిస్,వరంగల్: ప్రజల పక్షాన పోరాడటమే తప్పా....? అని వైఎస్‌ఆర్టీపీ చీప్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు వైఎస్ షర్మిల భయపడదని స్పష్టం చేశారు. విూ దాడులకు రెట్టింపు స్థాయిలో విూ అవినీతిని ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షర్మిల...విూలాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశానన్నారు. మరోసారి చెప్తున్నా బీఆర్‌ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ హెచ్చరించారు. గతంలో నర్సంపేటలో తమ బస్సును తగలబెట్టి, తమపై దాడి చేశారని ఆరోపించారు. నిన్న వర్ధన్నపేటలో ప్రజా ప్రస్థానం యాత్రపై దాడి చేశారని, ఏం జరిగినా తన పాదయాత్ర తిరిగి మొదలుపెట్టానని చెప్పారు. ప్లెక్సీలు చింపి, కవరేజ్ చేస్తున్న విూడియాపై దాడికి యత్నించారన్నారు. ప్రజల తరపున ప్ర...