Warangalvoice

Warangal

తీన్మార్‌ మల్లన్నకు మద్దతుగా ఇనగాల ప్రచారం
Warangal

తీన్మార్‌ మల్లన్నకు మద్దతుగా ఇనగాల ప్రచారం

వరంగల్ వాయిస్, పరకాల : వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను అధిక మెజారిటీతో గెలిపించాలని కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కోరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం గీసుగొండ మండలం, 15,16వ డివిజన్ల పరిధిలోని మండల డివిజన్ల స్థాయి సన్నాహక సమావేశాన్ని మరియాపురం గ్రామంలోని నక్షత్ర ఫంక్షన్ హాల్ లో, సంగెం మండలం 17వ డివిజన్ స్థాయి సమావేశాన్ని సంగెం మండల కేంద్రంలోని గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పరకాల నియోజకవర్గ ఇంచార్జి కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో ఆర్డినేటర్ వొడితల ప్రణవ్, పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల పట్టణ డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు....
ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
Warangal

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు వరంగల్ వాయిస్, వరంగల్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్రఅధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు పట్టబద్రులైన ఓటర్లకు పిలుపునిచ్చారు. బీసీ హక్కుల సాధన సమితి ఈ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ )కు సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు. గత పదేళ్లుగా పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరుసలిపి ప్రజా సమస్యలపై ముఖ్యంగా బీసీల, బడుగు, బలహీన వర్గాల, విద్యార్థి, యువజన, మహిళల, మైనారిటీల, అన్నివర్గాల ప్రజల సమస్యలపై పోరాడే, ప్రశ్నించే ప్రజా గొంతుకగా నిలుస్తున్న తీన్మార్ మల్లన్న శాసనమండలిలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో వివిధ వర్గాలకు జరుగుతున్నఅన్య...
ప్లాష్..ప్లాష్..  వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ
Crime, District News, Hanamkonda, Latest News, Warangal

ప్లాష్..ప్లాష్.. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను కూడా బదిలీ చేశారు....
కారుపై లింగాకారంలో గణపయ్య
Cultural, Warangal

కారుపై లింగాకారంలో గణపయ్య

నగరంలోని 20 డివిజన్ కాశిబుగ్గకు చెందిన వంగరి లక్ష్మీపతి బ్రదర్స్ ప్రతి ఏడు వినాయక నిమజ్జనంలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆనవాయితీని కొనసాగిస్తూ బుధవారం కారుపై శివలింగాకారంలో గణపతులను అందంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గణపయ్యను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అనంతరం చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వంగరి కుటుంబ సభ్యులు వంగరి రాజశేఖర్, రవి, గుండు చంద్రమోహన్, దేవలపల్లి నరేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -వరంగల్ వాయిస్, కాశిబుగ్గ  ...
విమోచనోద్యమం స్ఫూర్తితో మొదలైన.. మరో సమరం
Latest News, Political, Warangal

విమోచనోద్యమం స్ఫూర్తితో మొదలైన.. మరో సమరం

మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వరంగల్ వాయిస్, పరకాల : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ఆనాటి త్యాగధనుల సేవలను ప్రజలకు తెలియజేస్తామని కేంద్ర కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి బైక్ ర్యాలీగా పరకాలకు విచ్చేసిన ఆయన అమరధామంలో నివాళులర్పించారు. పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విమోచనోద్యమం స్ఫూర్తితో మరో సమరం మొదలైందన్నారు. తెలంగాణ ద్రోహి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఇక్కడి ప్రజలను అవమానపరిస్తున్నాడని మండిపడ్డారు. నిజాం పాలకులు తెలంగాణలో కర్కషత్వంగా వ్యవహరించి లక్షలాదిమంది ప్రజలను ...
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు
Crime, District News, Warangal

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు

భార్యభర్తల మృతి వరంగల్ వాయిస్, పరకాల : నడి కూడ మండలం ధర్మారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం 6.30గంటల సమయంలో హనుమకొండ నుంచి పరకాలకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని పరకాలకే వస్తున్న కారు మితిమీరిన వేగంతో ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న పరకాల పట్టణ కేంద్రానికి చెందిన భార్య, భర్తల్లో భర్త పసుల మొగిలి (55) అక్కడికక్కడే మృతి చెందాగా భార్య సావిత్రికి (50) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పరకాల ఎస్ఐ శివకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మొగిలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల తరలించారు. కారు డ్రైవర్ తోపాటు యజమాని పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు....
రంగసాయిపేటలో బీరన్న బోనాలు
District News, Warangal

రంగసాయిపేటలో బీరన్న బోనాలు

వరంగల్ వాయిస్, రంగసాయిపేట : ఈరోజు రంగసాయిపేటలో ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ బిరన్న దేవస్థానంలో బోనాల జాతర జరిగినది. ఆలయానికి ప్రధాన పూజారి మండల నర్సింహా రాములు, కుటుంబ సభ్యులతో ఆలయానికి పూజా సామాన్ల గంప నెత్తిపై ధరించి ఆలయానికి కురుమ కళాకారులు డప్పు చప్పులతో కళాకారులు ఆలయానికి విన్యాసాలు చేస్తూ ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ఆలయ పూజారి స్వామివారి లింగాలను పాలాభిషేకం పసుపు బండారి తో అలంకరించారు స్వామివారి కంకణాలు పసుపు బండారి మరియు గొర్రె పాలతో కంకణాలకు అభిషేకం చేశారు. స్వామివారి గద్దె మీద పెట్టి నైవేద్యం పళ్ళు పెట్టి స్వామివారికి చూపించారు. పూలతో అలంకరణ అఖండ దీపం వెలిగించి టెంకాయ కొట్టి గుమ్మడికాయ తో ఆలయానికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మంగళ హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు కంకణాలు భక్తులకు ఆలయ పూజారి ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక వైద్య నిపుణులు డాక్టర్ కె చంద్రశేఖర్, ఆర్య డాక్టర్...
ప్రీతిది ఆత్మహత్యే- వరంగల్ సీపీ రంగనాథ్
Crime, District News, Warangal

ప్రీతిది ఆత్మహత్యే- వరంగల్ సీపీ రంగనాథ్

వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిని ప్రీతి నాయక్ ది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. అయితే ఆమె ఆత్మహత్యకు సైఫ్ ప్రధాన కారణమన్నారు. ప్రీతి పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడైనట్లు ఆయన తెలిపారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో ఇంజెక్షన్ దొరికిందని, కానీ నీడిల్ దొరకలేదన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీ షీటును దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన సంచలనం కలిగించింది. ఇదిలా ఉంటే ప్రతీ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ కు కోర్టును నిన్ననే బెయిల్ మంజూరు చేసింది....
బస్టాండులో డ్రైవర్‌ నిర్లక్ష్యం
Crime, District News, Warangal

బస్టాండులో డ్రైవర్‌ నిర్లక్ష్యం

బస్సు ఢీకొనడంతో విద్యార్థి మృతి బస్సు అద్దాలు ధ్వంసం చేసిన తోటి విద్యార్థులు వరంగల్ వాయిస్, వరంగల్‌ : వరంగల్‌ బస్టాండ్‌ లో డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. విద్యార్థిని బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మిగతా స్టూడెంట్స్‌ బస్టాండులోనే ఉన్న నాలుగు బస్సుల అద్వాలను ధ్వంసం చేశారు. వీరితో పాటు ప్రయాణికులు కూడా ఆందోళనకు దిగారు. తన స్నేహితుడిని బస్సు ఎక్కించడానికి చింతా అనిల్‌ అనే విద్యార్థి వరంగల్‌ బస్‌ స్టాండ్‌ కు వెళ్లాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు.. అనిల్‌ ను ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన ప్రయాణికులు, విద్యార్థులు నాలుగు బస్సుల అద్దాలను కోపంతో ధ్వంసం చేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనిల్‌ మ...
సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా
Crime, District News, Hanamkonda, Warangal

సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా

-వరంగల్ పోలీస్ కమిషనర్ పి.వి. రంగనాథ్ వరంగల్ వాయిస్, క్రైం:  నేను సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని యం.పి బండి సంజయ్ కుమార్ వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్, నిన్నటి రోజున మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పై బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాక్యల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నన్ను లక్ష్యంగా చేసుకోని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు. నాపై ఇంతకాలం ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదు. గతంలో నల్గొండ, ఖమ్మంతో పాటు ప్రస్తుతంలో వరంగల్ కూడ బిజేపి, బిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులను అరెస్ట్ అయ్యారు. అప్పుడు చేయనటువంటి ఆరోపణలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అయినందుకు నాపై ఉక్రోషంతో ఆరోపణలు చేసినట్లు వుందని. కొన్ని ప్రాంతాల్...