Warangalvoice

Warangal

రవ్వ ప్రసాదం పంపిణీ
Cultural, Warangal

రవ్వ ప్రసాదం పంపిణీ

వరంగల్ వాయిస్, కాశీబుగ్గ : కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా 2వ రోజు సాయంత్రం పూజ కార్యక్రమం అనంతరం 60 కిలోల రవ్వ కేసరి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ వర్ధక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి, గుండేటి నరేంద్ర కుమార్, గుళ్ళపల్లి రాజకుమార్, గోరంటల మనోహర్, ఓరుగంటి కొమురయ్య, బోడకుంట్ల వైకుంఠం, మండల శ్రీరాములు, వంగరి రాంప్రసాద్, దుస్స కృష్ణ, బండారి రాజేశ్వరరావు, వంగరి రవి, ములుక సురేష్, దాసి శివకృష్ణ, కూరపాటి సతీష్, కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు....
వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలి
Hanamkonda, Telangana, Warangal

వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరం మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులతోపాటు పలు శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు పలు మార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు అందించామని తెలిపారు. గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతి పాదించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలన్నారు. ఇప్పటికే కన్సల్టెంట్లు తయారు చ...
బీజేపీ కరీంనగర్ జిల్లా కో-ఇంచార్జిగా అనిల్
Warangal

బీజేపీ కరీంనగర్ జిల్లా కో-ఇంచార్జిగా అనిల్

వరంగల్ వాయిస్, కరీమాబాద్ : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన గోగికార్ అనిల్ కుమార్ ను బీజేపీ ఓబీసీ మోర్చ కరీంనగర్ జిల్లా కో-ఇంచార్జిగా నియమించారు. ఈ మేరకు ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు కోవా లక్ష్మణ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాయకులకు అనిల్ పేరు పేరున ధన్యవాదలు తెలిపారు....
అంగన్ వాడీలో బడిబాట
District News, Warangal

అంగన్ వాడీలో బడిబాట

వరంగల్ వాయిస్, కరీమాబాద్ : నగరంలోని 40వ డివిజన్ కరీమాబాద్ సెక్టార్ పరిధిలోని సుభాష్ నగర్ (ఉర్సు) అంగన్ వాడీ కేంద్రంలో శనివారం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ పిల్లలు..దేశానికి వెలుగు దివ్వెలు, ఒత్తిడి లేని విద్య..అంగన్ వాడీ విద్య, అంగన్ వాడీ ఒడి..అభివృద్ధిల బడి, తల్లీబిడ్డ క్షేమం..అంగన్ వాడీ ఆశయం అనే నినాదాలు ఆయా వాడల్లో మారుమ్రోగాయి. 30 నెలలు నిండిన పిల్లలను అంగన్ వాడీ కేంద్రానికి వచ్చేలా అలవాటు చేసి మంచి అలవాట్లు, ఆటపాట, సృజనాత్మకత, భాష పరిచయం, కథలు చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లులు, గర్భిణులు, ఏఎల్ ఎంఎస్సీ కమిటీ సభ్యులు, అంగన్ వాడీ టీచర్లు బి.సునీత, టీ.నాగమణి, కిశోర బాలిక సుహిత, మహేశ్వరి, స్వప్న తదితరులు పాల్గొన్నారు....
లక్ష మందికి మజ్జిగ పంపిణీ
Top Stories, Warangal

లక్ష మందికి మజ్జిగ పంపిణీ

వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో మేదరి వాడ కార్యాలయం ముందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మజ్జిగ, అన్నదానం, ఉప్మా, అరటిపండు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం 60 రోజులు 85 మంది దాతలు 2,700 కిలోల మజ్జిగ పెరుగు, ఆరువేల లీటర్ల వాటర్, మూడు క్వింటాల అన్న వితరణ వీటన్నిటిని సుమారు 60 రోజుల్లో లక్ష మందికి పంపిణీ చేయడం గర్వకారణమన్నారు. సుమారు రెండు నెలపాటు నగరంలో ఉండే ప్రముఖులు, వైశ్యులు వారి వారి పుట్టినరోజులు, పెళ్లిరోజు, అదేవిధంగా జ్ఞాపకార్థం గుర్తు చేస్తూ పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కష్టపడి పనిచేసిన ఆర్యవైశ్య మిత్రబృందం నాయకత్వాన్ని సన్మానించారు. ఈ కార్...
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి
Top Stories, Warangal

ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల శరత్ వరంగల్ వాయిస్, వరంగల్ : జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, అనుమతి లేని కళాశాలల జాబితా విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఇంటర్ విద్యాశాఖ అధికారి డీఐఈఓ మాధవ్ రావుకు ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్ వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టి, ప్రైవేట్, కార్పోరేట్ కళాశాలల్లో వసూలు చేస్తున్నఅధిక ఫీజులను నియంత్రించి, ప్రభుత్వ అనుమతి లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేసి, ఇంటర్ నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అభిరామ్, శివ, రాకేష్ పాల్గొన్నారు....
రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి
Top Stories, Warangal

రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి

పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచర్ల బాలరాజు వరంగల్ వాయిస్, వరంగల్ : అఖిలభారత రైతుకూలీ సంఘం నర్సంపేట డివిజన్ కార్యవర్గ సమావేశం బుధవారం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు గట్టి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటే రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి ఆచరించలేకపోయింది. పైగా, ఆగస్టు 15లోపు అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటికే రైతులు అప్పుల బారిన పడి బ్యాంకులిచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో గత 40 సంవత్సరాలుగా గిరిజన గిరిజన పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారన...
కార్మిక వర్గం హక్కులను కాపాడేదే సీఐటీయూ
Top Stories, Warangal

కార్మిక వర్గం హక్కులను కాపాడేదే సీఐటీయూ

ముక్కెర రామస్వామి జిల్లా కార్యదర్శి వరంగల్ వాయిస్, వరంగల్ : సీఐటీయూ 54 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీమాబాదు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నూతన జెండాను సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భవించి నేటికి 54 సంవత్సరాలు అవుతుందన్నారు. ఐక్యత పోరాటం అనే నినాదాన్ని ఐదు దశాబ్దాల నుంచి ఆచరణలో పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. ముఖ్యమైన నినాదాన్ని ఆచరణలో అమలు చేసేందుకు అవిశ్రాంతంగా సీఐటీయూ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందన్నారు. దేశంలోనే ట్రేడ్ యూనియన్ ఉద్యమం ప్రారంభంలో సీఐటీయూ ఒంటరి అయినప్పటికీ ప్రయత్నాలు అధిగమించడమే కాకుండా నేడు కార్మిక వర్గానికి కాపాడడం, ఐక్య ఉద్యమాలను అభివృద్ధి చేయడంలో, కార్మిక వర్గం హక్కులు, వేతనాలు, ప్రయోజనాలను, పని పరిస్థితులను మెరుగుపరచడంలో ఛాంపియన్ గా సీఐటీయూ ముందు నిలిచి...
గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటేయండి
Top Stories, Warangal

గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటేయండి

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి వరంగల్ వాయిస్, వరంగల్ : తూర్పు నియోజకవర్గంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక సందర్బంగా గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డితో కలిసి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వరంగల్ ఎల్ఐసీ మెయిన్ బ్రాంచ్, ఎంజీఎం ఎదురుగా గల ఎల్ఐ సీ బ్రాంచ్, పలు విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులను కలసి వారితో ముచ్చటించారు. నిరుద్యోగులను మోసం చేసిందని గత ప్రభుత్వ బీఆర్ఎస్ ను, ఇప్పుడు దొంగ హామీలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మడం లేదని దుయ్యబట్టారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి పీఎల్ శ్రీనివాస్, గంగిడి...
తీన్మార్ మల్లన్నను గెలిపించండి
Warangal

తీన్మార్ మల్లన్నను గెలిపించండి

పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణ ప్రశ్నించే గొంతుక, నిజాన్ని నిర్భయంగా తెలిపే వ్యక్తి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని, తెలంగాణ రాష్ట్ర పోపా అధ్యక్షుడు, న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు శామంతుల శ్రీనివాస్ గురువారం శివనగర్ ప్రచారంలో పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు ఒక్కసారి అలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ శ్రేణులు కొండా దంపతుల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికి తిరిగి విద్యావంతుల ఓటర్లను కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండవ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా విద్యావేత్త గట్ల రాంరెడ్డిని కలిసి మద్ధతు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పగడాల సతీష్, చిట్టిమల్ల శ్రీనివాస్, విజయ రాం చందర్, శామంతుల కిరణ్, మంద రాజు, కృష్ణవేణి, సంతోషిని, రాధిక, సుధాకర్, తదితరులు ...