Warangalvoice

Warangal

రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలి
District News, Hanamkonda, Telangana, Warangal

రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలి

యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధ భేరి సభకు ముదిరాజులు మద్దతు తెలుపుతూ గురువారం హనుమకొండలోని హంటర్ రోడ్ లోని ముదిరాజ్ అర్బన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, భయ్యా స్వామి, పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ కులస్తులతో బీసీ రాజకీయ యుద్ధభేరి సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే బోయిన అశోక్ ముదిరాజ్, బీసీ నేత, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజుయాదవ్ హజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న కులం ముదిరాజు కులం అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నట...
బీజేపీ దామెర మండల నూతన అధ్యక్షుడిగా వేల్పుల రాజ్ కుమార్
District News, Hanamkonda, Telangana, Warangal

బీజేపీ దామెర మండల నూతన అధ్యక్షుడిగా వేల్పుల రాజ్ కుమార్

వరంగల్ వాయిస్, దామెర : భారతీయ జనతా పార్టీ దామెర మండలం నూతన అధ్యక్షుడిగా దామెర గ్రామానికి చెందిన వేల్పుల రాజ్ కుమార్ నియామకమయ్యారు. గత 15 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని వివిధ హోదాలలో ఉమ్మడి జిల్లా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా, గత స్థానిక ఎన్నికలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం దామెర వార్డు మెంబర్ గా, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన సేవలను గుర్తించి దామెర మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ నియామకానికి సహకరించిన జిల్లా ఎన్నికల అధికారి పెద్దోళ్ల గంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు మందు ఐలయ్య, కన్నబోయిన రాజయ్య యాదవ్, జిల్లా బీజేపీ నాయకులు గురుజాల శ్రీరామ్ ...
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
District News, Warangal

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మోహన్ సింగ్ ఎంజీఎం(పీపీయూనిట్) పరిశీలన వరంగల్ వాయిస్, వరంగల్ : ఎంజీఎం హాస్పిటల్ ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీపీ యూనిట్)ను వర్ధన్నపేట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్.మోహన్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్.మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని డాక్టర్ కు, స్టాఫ్ ను కోరారు. ముఖ్యంగా ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ 100శాతం టార్గెట్ రీచ్ కావాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరాల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉందని సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పిల్లలు, వృద్ధులు ఈ సమయంలో బయట తిరుగడం మంచిది కాదని తెలిపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వస్తే స్వెటర్ కానీ, ఉలన్ దుస్తులు ధరించి బయటికి వెళ్లాలని తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో...
కావేరీ కంపెనీ పత్తి విత్తనాల క్షేత్ర పదర్శన
District News, Warangal

కావేరీ కంపెనీ పత్తి విత్తనాల క్షేత్ర పదర్శన

వరంగల్ వాయిస్, దామెర : శనివారం రోజున దామెర మండలం పెంచికలపేటలో రైతు రవీందర్ వ్యవసాయ క్షేత్రంలో కావేరీ కంపెనీ వారి ప్రత్తి విత్తనాల క్షేత్ర పదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు రవీందర్ మాట్టాడుతూ తాను కావేరీ కంపెనీ వారి పత్తి విత్తనాలు వాడి అధిక దిగుబడులు సాధించానని, అంతే కాకుండా ఈ విత్తనాలు అధిక మన్నికతో ఉండడమే కాకుండా, చీడపీడలకు తావులేకుండా మంచి దిగుబడిని ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కావేరీ కంపెనీ టీసీఎం జి.నితిన్ రైతులు అడిగిన పలు సందేహాలకు సమాధానగా ఈ రకం పత్తి విత్తనాలు రసం పిల్చుకునే పురుగులను నివారించడమే కాకుండా  బెట్ట వాతావరణాన్ని తట్టుకొని నిలబడుతాయని, అంతే కాకుండా అధిక దిగుబడులను ఇస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు క...
వరంగల్ వాయిస్ కథనానికి స్పందన
District News, Warangal

వరంగల్ వాయిస్ కథనానికి స్పందన

ప్రమాదం అంచున ప్రయాణం పేరిట వరంగల్ వాయిస్ లో ఈ నెల 3న ప్రచురితమైన కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. ప్రమాదాలు జరుగకుండా శనివారం పాక్షికంగా ఏర్పాట్లు చేశారు. దారి పొడువునా కర్రలు పాతి వాటికి రిబ్బన్ లను అమర్చారు. దూరంనుంచి వచ్చే వాహనదారులకు సైతం కనిపించేలా వీటిని ఏర్పాటు చేశారు. అయితే పనులు త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించాలని కోరుతున్నారు. -వరంగల్ వాయిస్, వరంగల్...
మెడికల్ కాలేజీకి పార్థివ దేహం అప్పగింత
District News, Warangal

మెడికల్ కాలేజీకి పార్థివ దేహం అప్పగింత

వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కోన్ రెడ్డి ఆయిల్ రెడ్డి (85) బుధవారం అనారోగ్యంతో మరణించగా వారి కుమారుడు రామ్మోహన్ రెడ్డి, భార్య ఉపేంద్ర, కుటుంబ సభ్యులు సమాజ హితం కోరి పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ లో పార్థివ దేహాన్ని, పాకాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, అనాటమీ విభాగం ప్రొఫెసర్, సిబ్బంది ప్రేమ్ కుమార్ కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, డి.రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కే.శంకర్రావు యాదవ్, సలహాదారు డాక్టర్ రాజేంద్రప్రసాద్, కార్యనిర్వాక సభ్యులు అనంతుల కేదారి, రామచందర్, మనోహర్, చల్ల వెంకట్రెడ్డి, వీరస్వామి తదితర సామాజిక వాదులు పాల్...
ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు
District News, Warangal

ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు

వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ వరంగల్, హనుమకొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం’ వేడుకలను వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ లలితా దేవి, డాక్టర్ కె.వెంకటరమణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జన్ను కిరణ్ హాజరై ఫార్మసిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో ఫార్మసిస్టులు అతి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఫార్మసీ చట్టం 1948 సెక్షన్ 42 ఇంప్లిమెంట్ చేయాలని, డాక్టర్ ప్రెస్క్రిప్షన్ లేకుండా ఫార్మసిస్టులు పేషంట్స్ కు మందులు డిస్పెన్స్ చేయరాదని, వైద్యులు రాసిన ప్రెస్క్రిప్షన్ లో తప్పులు ఉంటే ధైర్యంగా ఎత్తి చూపాలని, కరోనా సమయంలో ఫార్మసి...
సహకార సంఘానికి రైతులే వెన్నెముకలు… 
District News, Warangal

సహకార సంఘానికి రైతులే వెన్నెముకలు… 

-సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 67వ వార్షిక మహాసభ సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. అనంతరం సీఈఓ రవి నివేదిక చదివి వినిపించాడు. కొందరు రైతులు నివేదికలో ఉన్నవి అన్ని తప్పులే అని వాపోయారు. అనంతరం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ త్వరలో రైతులకు కొత్త రుణాలు అందజేస్తామని తెలిపారు. ఈ వార్షిక మహాసభలో సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు చిన్నారెడ్డి మాట్లాడుతూ జల్లి గ్రామంలో గోదాం నిర్మించాలని దానికి రోడ్డు కోసం ఆరు గుంటల భూమిని ఇస్తున్నట్లు మహాసభ తెల్ల కాగితంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు....
సెప్టెంబర్‌‌17 ముమ్మాటికీ తెలంగాణ విలీన దినమే
District News, Telangana, Warangal

సెప్టెంబర్‌‌17 ముమ్మాటికీ తెలంగాణ విలీన దినమే

సీనియర్ జర్నలిస్టు, హనుమకొండ : తెలంగాణలో నైజాం విముక్తి కోసం జరిగిన పోరాటానికి గుర్తుగాసెప్టెంబర్ 17ను ముమ్మాటికీ విలీన దినోత్సవంగానే గుర్తించాలి. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఐక్యంగా పోరాటాలు చేశారు. కానీ బీజేపీ నేతలు హైదరాబాద్‌‌ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్‌‌17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోయబుల్లాఖాన్‌‌ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో ఎలా చూస్తాం. సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమయ్యే దశకు చేరుకున్నంక ‘‘చుట్టుముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ.. గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడుతం కొడుకో.. నైజాం సర్కరోడా’’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకునే వారు. నిజాంకు ప్రజలు ఘోరీ కట్టేందుకు సిద్ధమైన తర్...
అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు
Telangana, Warangal

అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు

దేశ రక్షణకు సైనికులు.. అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు కొనియాడిన మంత్రి సురేఖ రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం వరంగల్ వాయిస్, వరంగల్ : దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, దేశ సహజవనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సెప్టెంబర్ 11 సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలు అర్పించిన అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ, అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు అటవీ ఉద్యోగులు చేస్తున్న కృషిని మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. ‘మనిషి జీవితం అడవుల నుంచే ఆరంభమైంది. మానవ పరిణామక్రమానికి అడవులు సాక్షిభూతంగా నిలిచాయి. మనిషి ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందే క్రమంలో అడవులే ఆలవాలమయ్యాయి. తల్ల...