చోరీలకు పాల్పడిన నిందితులకై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయండి…సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ వాయిస్, క్రైం : చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వారిని అరెస్ట్ చేసి నిందితుల నుండి చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నప్పుడే ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అధికారులకు సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని గురువారం కాకతీయ విశ్వవిద్యాలయము సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కేసుల పరిష్కారం కోసం అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ...