Warangalvoice

Viral News

బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష
Crime, District News, Mahabubabad, Viral News

బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష

మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు మూడేళ్ల క్రితం ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ పట్టణంలోని కృష్ణ కాలనీలో నివాసముంటున్న జర్నలిస్ట్ కుసుమ రంజిత్ రెడ్డి-వసంత దంపతులు కుమారుడైన దీక్షిత్ రెడ్డి 18 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ స్థానికంగా ఉంటూ ఆటో మొబైల్ షాప్ నడుపుకుంటున్నాడు. ఆర్థికంగా ఉన్న దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని కుట్ర పన్నిన మంద సాగర్ ఆయ...
సాయంలోనూ తగ్గేదేలే..
District News, Telangana, Viral News

సాయంలోనూ తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ ఔదార్యం.. డ్రైవర్ ఇంటి నిర్మాణానికి రూ.15లక్షల సాయం కమలాపూర్ వాసి, డ్రైవర్ మహిపాల్ ఇంట విరిసిన ఆనందం వరంగల్ వాయిస్, హనుమకొండ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. పాన్ ఇండియా లెవల్ లో తగ్గేదేలే.. అనే నటనతో ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. మెగా కంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డాన్స్ , డైలాగ్ డెలివరీలో తనదైన మార్క్ చూపించుకుంటున్నాడు. సినిమా సినిమాకు తన కెరీర్ ను ఉన్నతంగా మలుచుకుంటున్నాడు. ఐకాన్ స్టార్ గా వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అయితే ఈ అల్లు వారి అబ్బాయి.. నటుడిగానే కాకుండా రియల్ లైఫ్ తన మంచి మనస్సుతో అందరినీ హృదయాలను ఆకట్టుకుంటున్నాడు. అభిమానులతో పాటు తన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా సొంతింటి వారిలాగా చూసుకోవడం ఆయనకే చెల్లింది. తాను మాత్రమే బాగుండడం కాదు.. తన దగ్గర పనిచేసేవాళ్లు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్త...
వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోపిడీ<br>ఇద్దరు దొంగల అరెస్ట్
Crime, Viral News

వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోపిడీ
ఇద్దరు దొంగల అరెస్ట్

నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె ఒంటిమీద ఉన్న బంగారాన్ని చోరీ చేసిన ఇద్దరు నిందితులను సీసీఎస్, మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు లక్ష పదివేల రూపాయల విలువ గల బంగారు ఆభరణంతో పాటు ద్విచక్రవాహనం, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన వివరాలను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్ నగరంలోని బి.ఆర్ నగర్ కు చెందిన అజారుద్దీన్, ఓరుగంటి రాజు ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఇద్దరు బాల్య స్నేహితులు. ఇద్దరూ చదువు మధ్యలో అపివేసి ఎలక్ట్రిషన్ గా పనిచేసేవారు. దీని ద్వారా వీరికి వచ్చే అదాయంతో పాటు అప్పులు చేసి మద్యం తాగుతూ, జల్సాలు చేసేవారు. దీంతో వీరికి అప్పులు అధికం కావడంతో పాటు వీరి జల్సాలకు డబ్బు లభించకపోవడంతో సులువు డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగం వీరి ప్రాంతంలోనే ఒంటరి నివసిస్తున్న వృద్ధురాల...
అమ్మాయి కాదు.. అమ్మమ్మ
Viral News

అమ్మాయి కాదు.. అమ్మమ్మ

మేకప్‌ తో బురిడి కొట్టించిన ముదురు లేడీ ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్‌ కు వెళ్తే చాలు.. ఎంత అందవిహీనంగా ఉన్నా.. అందంగా మార్చేస్తారు. ముసలోళ్లను సైతం అమ్మాయిల మాదిరిగా చూపెడతారు. మేకప్‌ వేసుకున్నప్పుడు చూసిన వారిని.. మేకప్‌ తీసేస్తే గుర్తుపట్టడం కష్టం. అలా మేకప్‌ మాయతో ఆ ఆంటీ.. కుర్రదానిలా మారిపోయింది. ఓ యువకుడ్ని దారుణంగా ముంచేసింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు జిల్లా, పుదుప్పేటలో ఇంద్రాణి (65) కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. ఇంద్రాణి కుమారుడు ఓ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అప్పటికే అతగాడికి పెళ్లై విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో 6 ఏళ్లుగా కొడుక్కి తగిన వధువు కోసం ఇంద్రాణి వెతుకుతోంది. 2021లో ఆమెకు ఆంధ్రప్రదేశ్‌ లోని తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య అనే మహిళ ఓ పెళ్లి బ్రోకర్‌ ద్వారా పరిచయమైంది. తనను చూసుకో...