వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
వరంగల్ వాయిస్, హసన్ పర్తి : యువ వైద్యురాలు అల్లాడి ప్రత్యూష ఆత్మ హత్యకు కారకులైన నలుగురిని హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్ లోని స్వగృహంలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. డాక్టర్ ప్రత్యూష మృతికి కారకులైన భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అతని తల్లితండ్రులు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతితోపాటు బానోతు శృతి కారులో హనుమకొండ-కరీంనగర్ ప్రధాన రహదారిలో వెళ్లుండగా కాకతీయ వెంటేజ్ క్రాస్ సమీపంలో హసన్ పర్తి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాటలతో ప్రేరేపించి డాక్టర్ ప్రత్యూష...



