జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేత
వరంగల్ వాయిస్, ఆరేపల్లి : ఆరేపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఆటల పోటీలను నిర్వహించి, మొత్తం 140 బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, లోక్సత్తా ఉద్యమ సంస్థ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుంకరి ప్రశాంత్ హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ,“ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. గణతంత్ర దినోత్సవం అనేది మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పవిత్ర దినం. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించింది. ప్రతి విద్యార్థి మంచిగా చదివి దేశానికి, రాష్ట్రానికి, తన గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి” ప్రభ...









