Harish Rao | ఇగ రుణమాఫీ… అదొక దారుణ విషాద గాథ : హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు 100 శాతం రుణమాఫీ కాలేదని, ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు 100 శాతం రుణమాఫీ కాలేదని, ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. వాస్తవం ఏమిటంటే, రైతు ఇంటికి, బ్యాంకుకు మధ్య తిరుగుతూనే ఉన్నరు. రుణమాఫీ విషయంలో చివరకు రైతుకు మిగిలింది ఒడువని దు:ఖం, తీరని అప్పు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
ఇగ రుణమాఫీ… అదొక దారుణ విషాద గాథ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. స్టేట్ లెవల్ బ్యాంకర్ల మీటింగ్‌లో సంపూర్ణ రుణమాఫీకి కావాల్సింది. 49,500 వేల కోట్లుగా చెప్పారు. ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుప...