KP Vivekananda | బడ్జెట్‌లో హైదరాబాద్‌కు కేటాయింపులు ఘనం.. నిధుల విడుదల మాత్రం శూన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
వరంగల్ వాయిస్, కుత్బుల్లాపూర్ : హైదరాబాద్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా జరిగినప్పటికీ.. నిధులు విడుదల చేయడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర పద్దులపై జరిగిన చర్చల సమయంలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ నగరానికి ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీకి రూ.2654 కోట్లు కేటాయించి రూ.1200 కోట్లను మాత్రమే విడుదల చేశారని తెలిపారు. హెచ్ఎండీఏకు రూ.2,500 కోట్లు కేటాయించి పైసా కూడా ఇవ్వలేదని విమర్...