KTR | నీ బిడ్డనో, నీ భార్యనో ఇష్టమొచ్చినట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం
శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు వ్యక్తితో నీ బిడ్డనో, నీ భార్యనో ఇష్టమొచ్చినట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు వ్యక్తితో నీ బిడ్డనో, నీ భార్యనో ఇష్టమొచ్చినట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఏమైనా స్వాత్రంత్య ఉద్యమం చేసి జైలుకు పోయిండా..? ఏం చేసి పోయిండు ఆయన జైలుకు..? సానుభూతి ఎందుకు..? మేం పోలేదా జైలుకు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైలుకు నేను కూడా పోయాను. బరా...