జక్కలొద్ది జగడం
ప్రాణాలు అరచేతిలొ పెట్టుకొని పరుగులుఅయినా వదలనిభూ కబ్జాదారులుతెరవెనుక చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతలు
జక్కలొద్ది భూముల జగడం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం రాత్రి పలువురు భూ కబ్జాదారులు40-50మంది అల్లరి మూకలతో కలిసి మహిళలు, గుడిసెవాసులపై దాడులకు పాల్పడ్డారు. కర్రలు, బీరు సీసాలతో విచక్షణారహితంగా కొట్టారు. చెప్పలేని విధంగా మహిళలను తిడుతూ పాశవిక ఆనందం పొందారు. గూండాల దాడిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కాగా, మరొక మహిళ చేయి విరిగింది. దీంతో గుడిసెవాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. రక్షించాలంటూ పలుమార్లు 100 డయల్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా వారు కూడా స్పందించలేదని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పూట కొంతమంది రౌడీల్లా ప్రవర్తిస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రపై మహిళా లోకం భగ్గుమంటోంది. కాగా జక్కలొద్ది భూములను రక్షించాలంటూ గతం...