ఈ దారి.. నరక దారి
ఈ గుంతల లోతు.. పాలకుల నిర్లక్ష్యమంత!అధ్వానంగా నర్సంపేట -కొత్తగూడెం ప్రధాన రహదారిఎమర్జెన్సీ వాహనాలకు తప్పని ఇక్కట్లుప్రభుత్వాలు మారినా.. మారని దుస్థితి..!అదమరిచి జాలీగా ఆ రోడ్డుపై ప్రయాణించారా? ఇక అంతే సంగతులు.. నరకానికి డైరెక్ట్ టికెట్ తీసుకున్నట్టే.. ఏళ్ల తరబడిగా ఆ రోడ్డును పట్టించుకున్న వాళ్లు లేరు.. ప్రయాణికుల గోడు విన్నవాళ్లు లేరు.. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. రోడ్డుపై గుంతలతో వాహనదారులు నానా యాతన పడుతున్నారు. ఇక ఎమర్జెన్సీ వాహనాల పరిస్థితి అయితే దారుణం. ఇటీవల ఓ అంబులెన్స్ దిగబడడంతో వేరే వాహనం తీసుకొచ్చి బయటకు లాగి.. పేషెంట్ ను అత్యవసరంగా నర్సంపేట ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ వాయిస్, ఖానాపూర్
వరంగల్ వాయిస్, ఖానాపూర్: పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా పల్లెల రూపురేఖలు మాత్రం మారటం లేదు. పల్లె ప్రగతి ...