జర జాగ్రత్త..
అడుగుకోగుంత.. ఆదమరిస్తే తంటావర్షపునీటితో నిండిన గుంతలుమహా నగరంలో రోడ్లపై పొంచి ఉన్న ప్రమాదంచొద్యం చూస్తున్న బల్దియాస్టేషన్ రోడ్ లో పెద్ద గుంతను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు
మహా నగర ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఎక్కడ గుంత ఉందో.. అది ఎంత లోతు ఉంటుందో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ పరిస్థితి మరీ దయనీయం. ఆదమరిచి ముందుకుపోతే ఆస్పత్రి పాలుకాక తప్పడం లేదు. ప్రధాన రహదారులపైనున్న గుంతల్లో నిత్యం పదుల సంఖ్యలో వాహనదారులు పడుతున్నా బల్దియా పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. అయితే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు గుంతల్లో కంకర, మట్టి పోస్తూ తమ ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు ఉన్న సోయి బల్దియా పాలకులకు లేకుండా పోయిందంటూ బాటసారులు, వాహనదారులు బహిరంగంగానే తిట్టుకుంటున్నారు. ...