Warangalvoice

Top Stories

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు
Telangana, Today_banner, Top Stories

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిఎస్సెస్సీ టాపర్లకు అవార్డుల ప్రదానం వరంగల్ వాయిస్, నిజామాబాద్ : తెలివితేటలు ఏ ఒక్కరికే సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం చిట్ల ప్రమీల, జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి యేటా నిర్వహిస్తున్న ఆనవాయితీని పాటిస్తూ ‘ విద్యా స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణంలోకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,...
‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి
District News, Political, Telangana, Top Stories

‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి

ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీపార్టీ బలోపేతమే లక్ష్యంఆగ‌స్టు 2నుంచి బండి సంజ‌య్ మూడో విడ‌త పాద‌యాత్ర‌యాదాద్రి లక్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధినుంచి ప్రారంభం26న వ‌రంగ‌ల్‌లో భారీ ముగింపు స‌భ‌హాజ‌రుకానున్న బీజేపీ చీఫ్ న‌డ్డా ఓరుగల్లుపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. అధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్ట‌నున్న‌ మూడో విడ‌త పాద‌యాత్ర‌ను మొద‌ట వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధినుంచే ప్రారంభించి యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ముగించాల‌ని భావించినా చివ‌రి నిమిషంతో షెడ్యూల్ మారింది. పాద‌యాత్ర‌ను యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ఆగ‌స్టు 2వ‌ తేదీన ప్రారంభించి అదే నెల 26న వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధిలో ముగించేలా ప్లాన్ చేశారు. ముగింపు సంద‌ర్భంగా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో భ...
స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?
District News, Hanamkonda, Top Stories, Warangal

స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?

న‌గ‌రంలో 121 ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లునేటికీ ముందుకు ప‌డ‌ని అడుగులుఇబ్బందులో ప్ర‌జ‌లుమొద్దునిద్ర‌లో బ‌ల్దియా అధికారులు రాష్ట్రంలో రెండో అతి పెద్ద న‌గ‌రంగా అభివృద్ధి చెందుతున్న వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌రాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు పాల‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు నీటి మూట‌లుగా మారుతున్నాయి. అధికారుల అల‌స‌త్వం, పాల‌కులు ప‌ట్టింపులేని త‌నంతో న‌గ‌రం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెన‌క్కి వెళ్తోంది. న‌గరంలో నూత‌నంగా చేప‌ట్టాల్సిన ఎన్నో ప‌థ‌కాలు కేవ‌లం కాగితాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. ఇదే బాట‌లో న‌గ‌రంలో స్మార్ట్ బ‌స్ షెల్ట‌ర్‌ల నిర్మాణ ప్ర‌క్రియ‌ను కూడా బుట్ట‌దాఖ‌లు చేశారు. దీంతో పాత‌కాల‌పు నాటి బ‌స్ షెల్ట‌ర్‌తోనే న‌గ‌ర ప్ర‌జ‌లు స‌ర్దుకోవాల్సి వస్తోంది. న‌గ‌రంలో మోడ్రన్ బ‌స్ షెల్ట‌ర్‌ల నిర్మాణం ఎప్పుడు చేస్తారో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి న...
75 ఏండ్ల స్వాతంత్ర భారతం.. దక్కని స్వాతంత్య్ర ఫలం
District News, Top Stories

75 ఏండ్ల స్వాతంత్ర భారతం.. దక్కని స్వాతంత్య్ర ఫలం

దుర్విచక్షణ, అసమానతలను అధిగమించి దేశీయంగా ప్రగతి సాధించబడాలనేది రాజ్యాంగ నిర్మాతల అభిమతం. కానీ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్నా అది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారతీయుల సగటు ఆయుర్ధాయాన్ని నేటికీ కూడా కులమే నిర్దేశిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అధ్యయనం అగ్రవర్ణాలతో పోలిస్తే.. ఎస్సీ, ఎస్టీల జీవిత కాలంలో నాలుగు నుంచి ఆరేండ్లు తగ్గుదలగా ఉన్నట్లుగా చెబుతున్నది. ఆయా సామాజిక వర్గాల సగటు ఆయుఃప్రమాణంతో 20 ఏండ్ల క్రితం 4.6 సంవత్సరాల తేడా ఉంటే 2016 నాటికి అది 6, 1కి పెరిగింది. ప్రజారోగ్యాన్ని ప్రోదిచేయడం ప్రభుత్వాలు, పాలకుల కర్తవ్యం అని 47వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తున్నది. కానీ ఈ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచడం లేదు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందాలని 1946లోనే భోర్‌ కమిటీ సూచించింది. ప్రత...
సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే
District News, Hanamkonda, Top Stories, Warangal

సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే

గ్రేటర్‌లో సగానికిపైగా మహిళా ప్రతినిధులేవీరిలో చాలా మంది వంటింటికే పరిమితంరాజకీయంగా చక్రం తిప్పుతున్న పతులుఅధికారిక కార్యక్రమాల్లోనూ వారేప్రకటనల్లోనూ భార్య పేరు పక్కనే భర్త పేరుఅయోమయానికి గురవుతున్న జనం మహిళా సాధికారత కేవలం కాగితాలకే పరిమితమైంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నప్పటికీ చక్రం తిప్పేది మాత్రం పురుషులే. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్లు మహిళల జీవితాల్లో మార్పు తేవడం లేదు. చట్టసభల్లోనూ వారు భర్తల కనుసన్నల్లోనే నడుచుకుంటున్నారు. భర్త ఎస్‌ అంటే ఎస్‌ అని నో అంటే నో అంటూ వ్యవహరిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు సైతం పతులే హాజరవుతున్నారు. సతులు గడప దాటకుండా కేవలం అధికారిక పత్రాలపై ఆటోగ్రాఫ్‌లకే పరిమితమవుతుండగా పతులు మాత్రం పొద్దున లేచింది మొదలు పొద్దుపోయే వరకు రాజకీయంగా చక్రం తిప్పుతూ హడావిడి సృష్టిస్తున్నారు. కొంతమంది భర్తలు ఇంకొంచెం ముందడుగు ...
‘చేనేత’లో ఇంటిదొంగలు
Today_banner, Top Stories

‘చేనేత’లో ఇంటిదొంగలు

వ‌డ్డీతోస‌హా గ్రాంట్‌ను మింగిన ఘ‌నులురూ.3 కోట్లు స్వాహా..అవినీతికి పాల్పడిన చేనేత సహకార సంఘం అధ్య‌క్షులుత్రిపుల్ ఆర్ స్కీం ద్వారా డ‌బ్బులు మంజూరుప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ఆడిట్ అధికారులుచ‌క్రం తిప్పిన వరంగల్ జిల్లా సహ‌కార కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ చేనేత కార్మికుల సంక్షేమాన్ని అటకెక్కించారు.. వారికి చేతినిండా ప‌ని క‌ల్పించాల‌న్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ల‌క్ష్యాల‌ను నీరుగార్చారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని 15 చేనేత స‌హ‌కార సంఘాలకు గ్రాంటు రూపేణా అంద‌జేసిన డ‌బ్బుల‌తోపాటు దానిపై వ‌చ్చిన వ‌డ్డీని సైతం దిగ‌మింగారు. అందుకు వ‌రంగ‌ల్ జిల్లా చేనేత స‌హ‌కార కార్యాల‌య అధికారుల‌ను పావులుగా వాడుకున్నారు. వారికి అంతో ఇంతో ముట్ట‌జెప్పి పైసా ఖ‌ర్చు చేయ‌కుండా, క‌నీసం బిల్లులు కూడా లేకుండానే ఆడిట్ చేయించుకున్నారు. చేసేదే మ‌నం.. మ‌న‌ల్ని ఎవ‌రు ప్ర‌శ్నిస్తారు అనుకున్న అధికారులు సైతం చేనేత స‌...
మట్టి విగ్రహాలపై ముందస్తు చర్యలేవి?
Cultural, Top Stories

మట్టి విగ్రహాలపై ముందస్తు చర్యలేవి?

దగ్గరకొస్తున్న వినాయక చతుర్థిపలు ప్రాంతాల్లో ప్రారంభమైన విగ్రహాల తయారీపీఓపీ విగ్రహాలకే తయారీదారుల మొగ్గుచెరువుల నీటిని కలుషితం చేస్తున్నా పట్టించుకోని యంత్రాంగంముందస్తు అవగాహన కల్పించడంలో బల్దియా విఫలంమట్టి విగ్రహాలనే వాడాలంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలుగ్రేటర్‌ తీరును ఎండగడుతున్న పర్యావరణ ప్రేమికులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తోపాటు వివిధ రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలు పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయి.. చెరువుల్లోని నీరు కలుషితం అవుతుండడంతో వాటిలో నివసించే జీవ జాతులు అంతరించిపోతున్నాయి.. అందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను మాత్రమే పూజిస్తామంటూ ప్రతీనబూనాలి.. ఇదే అన్నివిధాలా శ్రేయస్కరం.. ఈ రోజు మనం నిర్మించే సమాజమే మన భావితరాలకు స్వేచ్ఛా వాయువులను ఇస్తుంది.. అంటూ ప్రతియేడు వినాయక చవితి పండుగ సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, బల్దియా సిబ్బంది ఊదరగొట్టే ఉపన్యాసాలు చేస్తుంటారు. కాని ఆచర...
శాకంబరి శరణం మమ:
Cultural, Top Stories

శాకంబరి శరణం మమ:

అంగరంగ వైభవంగా ముగిసిన భద్రకాళి నవరాత్రోత్సవాలు4 టన్నుల పండ్లు, కూరగాయలతో అమ్మవారి అలంకరణసేంద్రియ పద్ధతిలో పండిరచిన వ్యవసాయ క్షేత్రాలనుంచి సేకరణజోరువానలోనూ తరలి వచ్చిన భక్తులుభారీ బందోబస్తు చేసిన పోలీసులు జై భద్రకాళీ.. జై జై శాకంబరి మాత.. అంటూ భక్తులు భక్తిభావంతో పులకించి పోయారు. అమ్మవారి శాకంబరి నవరాత్రులు బుధవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు భద్రకాళి మాత శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణ కోసం సేంద్రియ పద్ధతిలో పండిరచిన 4 టన్నుల పండ్లు, కూరగాయలను తెప్పించారు. ఈ వేడుక సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షంలో సైతం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శాకంబరి అలంకరణలో ఉన్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తరించారు. నవరాత్రోత్సవాలకు సహకరించిన అందరికీ ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.-వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌ వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌ : నగరంలోని సుప...