Warangalvoice

Top Stories

లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..
Bhupalapally, District News, Hanamkonda, Mahabubabad, Top Stories, Warangal

లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..

ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. నేతలు, లీడర్లు అంతా ఆటో కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, వరంగల్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, బీజేపీ నేత రాకేష్‌ రెడ్డి తదితరులు ఆటో నడిపి ఆటో కార్మికులను ఉత్సాహపరిచారు. -వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి Gandra Venkataraman Reddy...
స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు
District News, Jangaon, Top Stories

స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు

వరంగల్‌ వాయిస్‌, జనగాం : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ మరియు హెల్పర్స్‌ యూనియన్‌ టీఎన్‌ జీవో (తెలంగాణ నాన్‌ గెజిటడ్‌ ఆఫీసర్స్‌) అనుబంధం జనగాం జిల్లా అధ్యక్షురాలు కాసగోని స్వరూపరాణి, కార్యదర్శి గుమ్మడవెల్లి రమాదేవి ఆధ్వర్యంలో స్టేషన్‌ ఘనపూర్‌ ప్రాజెక్ట్‌, రఘునాథపల్లి మండల కేంద్రంలోని కోమళ్ళలో అంగన్వాడీ టీచర్స్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వరూపారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల జీవితాలు బాగున్నాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతను వివరించారు. రఘునాథపల్లి మండలం అధ్యక్షురాలు గొట్టం మంజుల, కార్యదర్శి ఎండీ ఫాతిమా, కోశాధికారి ఐలమ్మ, కోమళ్ల సర్కిల్‌ అధ్యక్షురాలు ఇల్లందుల రాజమణి, కార్యదర్శి నల్ల నర్సమ్మ, కోశాధికారి తమ్మడపల్లి శారద, కార్యవర్గ సభ్యుల బొల్లాపల్లి ప్రేమలత, చేపురి మమత, కింద విజయ, మార...
తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం
Top Stories

తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

నేల కూలిన భారీ వృక్షంరోడ్డు వెడల్పులో స్వామి భ‌క్తి వరంగల్ వాయిస్, కాశీబుగ్గ : నగరంలోని 20వ డివిజన్‌లో నిత్యం ర‌ద్దీగా ఉండే ప్రాంతంలో సోమ‌వారం కురిసిన వ‌ర్షానికి భారీ వేప చెట్టు నేల కూలింది. చెట్టు రోడ్డుకు ఎదురుగా ఉన్న ఇంటిపై, విద్యుత్ తీగ‌ల‌పై ప‌డింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయి తీగ‌లు వేలాడుతూ క‌నిపించాయి. స్థానికులు గుర్తించి విద్యుత్ కార్యాల‌యానికి స‌మాచారం అందించ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. దీంతో చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌వారు ప్రాణ భ‌యంతో ప‌రుగులు పెట్టారు. అయితే స్వామి భ‌క్తిని చాటుకునేందుకు మాజీ కార్పొరేట‌ర్ ఒక‌రు రోడ్డు వెడ‌ల్పును అడ్డుకున్నందునే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. న‌గ‌ర అభివృద్ధిలో భాగంగా పది రోజుల క్రితం 20వ డివిజ‌న్‌లో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయ‌న్న నెపంతో నిరుపేద‌ల‌కు చెందిన కొంద‌రి ఇళ్ల‌ను కూడా క...
సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్
District News, Legend, Today_banner, Top Stories

సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్

విద్యావేత్త నుంచి కుడా చైర్మన్‌ దాక సుందర్‌ రాజ్‌ యాదవ్‌ విజయ ప్రస్థానంఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్‌ అధిష్ఠాన విధేయుడిగా పేరుఅందరితో కలివిడిగా.. పార్టీకి ట్రబుల్‌ షూటర్‌గా..చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ కు కుడిభుజంగా ప్రసిద్ధిఅఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఘన సన్మానం తెలంగాణ ఉద్యమ కారుడు.. విద్యా సంస్థల అధిపతి.. టీఆర్ఎస్ క్రియాశీల నాయకుడు.. ఈ మూడు విభిన్న రంగాలకు వంద శాతం న్యాయం చేసిన సమర్థత సుందర్ రాజ్ యాదవ్ సొంతం. ఓపిక, సహనం ఆభరణాలుగా, నిబద్ధత, నిజాయితీ పెట్టుబడిగా ఎదిగిన వినయశీలి. దశాబ్దకాలం ఎదురుచూపులకు కుడా చైర్మన్ పదవి రావడం.. ఉద్యమకారుడికి లభించిన సముచిత గౌరవం. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద కమ్యూనిటీల్లో ఒకటైన యాదవ కులానికి దక్కిన గుర్తింపు.. ఏప్రిల్ 7న బాధ్యతలు స్వీకరించిన సుందర్ రాజ్ యాదవ్ ను అఖిల భారత యాదవ మహాసభ ఘనంగా సన్మానించనుంది. 31న (రేపు) హనుమకొండ చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ ...
శ్రావణ మాసోత్సవాలను ప్రారంభించిన కార్పొరేటర్
Top Stories

శ్రావణ మాసోత్సవాలను ప్రారంభించిన కార్పొరేటర్

వరంగల్ వాయిస్, వరంగల్ : శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రామన్నపేట, వరంగల్ నందు శ్రావణ మాసోత్సవాలను శుక్రవారం స్థానిక కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిమాన్వితమైన జిల్లాలోనే ప్రత్యేకంగా నర్మదాబాణ లింగం, అన్నపూర్ణ మాత భద్రకాళీ వీరభద్ర స్వామిలతో కూడిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు అద్భుతంగా జరుగుతాయని భక్తులు పాల్గొనాలని పిలుపిచ్చారు. అర్చకులు తనుగుల రత్నాకర్ అయ్యగారు స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేయించారు. అనంతరం అన్నపూర్ణ దేవికి ప్రత్యేక అలంకారం అర్చనలు చేశారు. శ్రాణమాసం మొదటి రోజే శుక్రవారం కావడంతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. భక్తులకు ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అప్పరాజు రాజు, సభ్యులు చిట్టిమళ్ళ సురేష్, కటకం రాములు, పప్ప...
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
Top Stories

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

వరంగల్ వాయిస్, హనుమకొండ : వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కల్లూరి పవన్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా శనివారం పవన్ మాట్లాడుతూ వీఆర్ఏలు రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కింది స్థాయి ఉద్యోగులుగా పని చేస్తున్నారని, ప్రభుత్వం ప్రవేశ పెట్టె ప్రతి సంక్షేమ పధకాన్ని అమలు చేసే క్రమంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ వీఆర్ ఏలు కూడా గౌరవంగా బ్రతకాలని, వారికి కూడా పే స్కేల్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వక పోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించే వరకు జాతీయ బీసీ యువజన సంఘం పోరాడుతుందని అన్నారు....
ప్రతిభావంతులకు అండ.. ‘చిట్ల’ మోరియల్ ట్రస్ట్
District News, Today_banner, Top Stories

ప్రతిభావంతులకు అండ.. ‘చిట్ల’ మోరియల్ ట్రస్ట్

సామాజిక సేవే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిఅమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఆలోచన..పుట్టిన ఊరికి ఏదైనా చేయాలన్న తపనపేద విద్యార్థులకు భరోసాగా ట్రస్ట్ ఏర్పాటువిద్యా స్ఫూర్తిగా సాగుతున్న బృహత్తర కార్యక్రమం ‘‘పేదరికం ఎంతో కఠినమైనదో తెలుసు.. దాని ఫలితాలు మనిషి జీవితంపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసు.. పేదరికంపై విజయం సాధించాలంటే సగటు జీవికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధం.. చిన్నతనంలో అమ్మనాన్న పడిన కష్టమే తనను ఉన్నత శిఖరాలు అధిరోహింపజేసేలా చేసింది..’’ ఈ మాటలు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చిట్ల పార్థసారథి హృదయాంతరాల్లోనుంచి వచ్చినవి. అమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడానికి చిట్ల ప్రమీల - జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ను ఆయన 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ యేడాది పేద ప్రతిభావంతులకు ప్రోత్సాహంగా నగదు పురస్కా...