రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న గవర్నర్
రాజ్యాంగ విలువలు కాపాడుకోవడం మన బాధ్యత
గాంధీ జయంతి సభలో స్పీకర్ పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా
వరంగల్ వాయిస్,హైదరాబాద్: వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని గవర్నర్ తీరుపై మండలి ఛైర్మన్ గుత్తి సుకేదంర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డలు విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శాసన మండలి, శాసన సభ, గవర్నర్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభలో వారు నివాళి అర్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యంగాబద్దంగా వ్యవహరిం చాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు ఆమోదం తెలకపోవడంతో తెలంగాణ గవర్నర్ తమిళి సై తీరుపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. అయితే అన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాం...








