Warangalvoice

Top Stories

Top Stories

గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మార్వో

వరంగల్ వాయిస్, దామెర:విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విద్య అందించాలని  దామెర ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి అన్నారు. బుధవారము దామెర మండలంలోని ఓగ్లాపూర్ ఎస్బిఐటి ఆవరణలో గల మైనారిటీ పాఠశాల మరియు మాత్మ గాంధీ జ్యోతిరావు పూలే ఆశ్రమ పాఠశాలలలోని విద్యార్థులకు  తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపును పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిసర ప్రాంతాలను  వంట గదులను పరిశీలించి నాణ్యమైన కూరగాయలతో రుచికరంగా విద్యార్థులకు  నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వైద్య బృందం, ఆర్ఐసంపతిరావు, జిపిఓ హరిప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....
ఊరుగొండ పీఏసీఎస్‌ సందర్శన
Top Stories

ఊరుగొండ పీఏసీఎస్‌ సందర్శన

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఊరుగొండలోని పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యూరియా నిల్వలు, అమ్మకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవీందర్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రాకేష్, కమలాకర్, అరుణ్, జగదీష్, రామకృష్ణ, సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు....
Top Stories

పెద్దాపురం పీఏసీఎస్ పాలకవర్గం రద్దు

రుణాల ఎగవేతే కారణం

వరంగల్ వాయిస్, దామెర : రుణాల ఎగవేత కారణంగా పెద్దాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) పాలకవర్గాన్ని రద్దు చేస్తూ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో పెద్దాపురం సొసైటీ చైర్మన్ బొల్లు రాజు, ఎనిమిది డైరెక్టర్లను పదవుల నుంచి తొలగించారు. దీంతో వీరు పదవులు కొల్పొయారు.  మాదారం పీఏసీఎస్ చైర్మన్, ఎనిమిది డైరెకర్లు పీఏసీఎస్ నిధులను దుర్వినియోగం చేశారని ఉత్తర్వుల్లో వివరించారు.

కొత్త ఇంఛార్జిల నియామకం..
       నిధుల దుర్వినియోగం, రుణాల ఎగవేత వంటి కారణాలతో రద్దైన ఈ రెండు పీఏసీఎస్‌లకు పర్సన్ ఇంఛార్జిని నియమించినట్లు డీసీఓ సంజీవరెడ్డి తెలిపారు. రద్దు చేయబడిన పాలకవర్గం నుంచి దుర్వినియోగమైన నిధులను తిరిగి రాబట్టడానికి త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చల్లా జన్మదిన వేడుకలు
Top Stories

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చల్లా జన్మదిన వేడుకలు

వరంగల్ వాయిస్,దామెరదామెర మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో సోమవారము బిఆర్ఎస్  ఆధ్వర్యంలో ఘనంగా చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముద్దసాని సహోదరు రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు యూరియాను అందించలేని స్థితిలో ఉందని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి ఎంపిటి సి స్థానిక గ్రామాల సర్పంచులను  బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు.ఈ నేపథ్యంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దామెర మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తామని కేసీఆర్ వాగ్దానం చేశారని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం జూనియర్ కళాశాల ను మంజూరు చేయాలని ఆయన అన్నారు. మాజీ వైస్ ఎంపీపీ జాకీర్ అలీ మాట్లాడుతూ పరకాల అభివృద్ధి ప్రదాత చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంల...
ఘనంగా చల్లా జన్మదిన వేడుకలు
Top Stories

ఘనంగా చల్లా జన్మదిన వేడుకలు

వరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లా మండల కేంద్రంలోదమ్మన్నపేట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకుడు దుబాసి నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో అభిషేకం అర్చన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బిక్షపతి, అనిల్, రఘుపతి రెడ్డి, రాజు, ప్రమోదు, రాజు, నాగరాజు, బాలయ్య, శ్రావణ్, తిరుపతి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు....
Top Stories

గంగమ్మ ఒడిలో గణపయ్య

వరంగల్ వాయిస్, శాయంపేట :మండలంలోని నర్సింహులపల్లె  గ్రామంలో చెన్నకేశవర స్వామి గుడిలో గణపత  నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులందరూ వినాయకుని రథయాత్రను డప్పు చప్పుళ్ల తో ఊరేగింపు కార్యక్రమంలో ఆడపడుచులందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి స్వామి వారి రథం ముందు బిందెలో నీళ్లు తెచ్చి రథానికి ఆరగింపి చేసి కొబ్బరికాయలు కొట్టి మంగళ హారతులు సమర్పిం చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పసుపులేటిఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, రాజు,కృష్ణ,రాజేందర్ నాగరాజు, కర్ణాకర్,రవీందర్,   నాగరాజు,నరేందర్,రాజు, కృష్ణ, చిలకయ్య, సుమన్, కాజా పాషా, శ్రీను,చంద్రమౌళి,సురేందర్, కృష్ణ, బిక్షపతి  మల్లయ్య, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు...
పొలం బాట పట్టిన విద్యుత్ అధికారులు
Top Stories

పొలం బాట పట్టిన విద్యుత్ అధికారులు

వరంగల్ వాయిస్, దామెర:రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని డివిజనల్ ఇంజనీర్ సౌమ్య నాయక్ అన్నారు. గురువారము మండలంలోని దామెర, తక్కలపాడు గ్రామాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పోలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సౌమ్య నాయక్ మాట్లాడుతూ...వ్యవసాయ పొలాల వద్ద  స్టార్టర్లకు ఎర్తింగ్ చేసుకోవాలని, దుస్తులను ఆరవేయడానికి ఇనుప తీగలను వాడరాదని  అన్నారు. వర్షాకాలంలో గాలికి చెట్లు విరిగి కరెంటు తీగలపై పడినప్పుడు వాటిని ముట్టుకోకుండా విద్యుత్ సిబ్బందికి తెలుపాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ కి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించాలని తెలిపారు. కార్యక్రమంలో పరకాల ఏడిఈ దేవేందర్, స్థానిక ఏ ఈ గుర్రం రమేష్, ఎల్ఎంలు మనోహర్ గిరిబాబు,ఏఎల్ఎంలు కృష్ణ, రమేష్, రాజశేఖర్,శంకర్,ప్రభాకర్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు....
ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్  ప్రశాంతి
Top Stories

ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్  ప్రశాంతి

వరంగల్ వాయిస్, హనుమకొండ :పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ నందు రసాయన శాస్త్ర  అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ ఎం ప్రశాంతి ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి లో ఉత్తమ అధ్యాపకురాలిగా కాకతీయ యూనివర్సిటీ పరిధి నుండి మొదటి స్థానంలో ఎంపిక అయ్యారు. వీరి విద్యాభ్యాసం మొత్తము కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగినది. మీరు 2005లో పీహెచ్డీ పూర్తి చేసుకున్నారు. డాక్టర్ ఎం ప్రశాంతి 2004 పీఎస్సీ  ద్వారా జూనియర్ లెక్చరర్ గా నియమితులయ్యారు. 2010 లో డిగ్రీ అధ్యాపకురాలిగా ప్రమోషన్ పొందారు. వీరు మొదట ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాల నందు పనిచేశారు. ఆ తరువాత కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాల నందు పనిచేశారు ప్రస్తుతము పింగిలి మహిళా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పని చేసినప్పుడు వీరు రసాయన శాస్త్ర విభాగపు అధిపతిగా వ్యవహరించారు. ప్రస్తుతము పింగిలి మహిళా డిగ్రీ కళ...
ఒగ్లాపూర్ లో అన్నదానం
Top Stories

ఒగ్లాపూర్ లో అన్నదానం

వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామం లోని కాపు వాడలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద ఆకుల శోభా కుమారస్వామి పుణ్య దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాదం వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామెర ఎస్సై కొంక అశోక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఎస్సై అశోక్ ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కనుకుంట్ల జీవన్ రావు, ఆకుల రవీందర్, మాజీ ఉపసర్పంచ్ ఆకుల కుమారస్వామి,ఆకుల కోటి, కనుకుంట్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు....
దుష్ప్రచారం తగదు
District News, Top Stories

దుష్ప్రచారం తగదు

ఆర్టికల్ 342 (2) అనుసరించే లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్స్. చరిత్రపై అవగాహన లేకనే లంబాడీల పై  వలస వాదులుగా  చెడు ప్రచారం. అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించాలి. లంబాడీలది తెలంగాణలో వెయ్యి ఏళ్ల చరిత్ర లంబాడీలపై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్య తెలంగాణ గిరిజన చరిత్ర (లంబాడీలు)లో ఒక గొప్ప అధ్యాయం (వరంగల్ వాయిస్, వరంగల్): భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పొందుపరివిన రిజర్వేషన్స్ నేపథ్యంలో కొన్ని గిరిజన తెగలను గుర్తించడం జరిగింది. ఒక తెగను గిరిజనులుగా గుర్తించడానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఒక తెగ ను ఎస్‌‌టీగా గుర్తించాలంటే ఆతెగకు ప్రత్యేక సంస్కృతి, భాష, ఆచారాలు, అడవులు, కొండ కోనల్లో తిరుగుతూ అక్కడే వృత్తి చేసుకునే వారై ఉండాలి. 1956 కంటే ముందు తెలంగాణలో లంబాడాలు బీసీ-ఏ జాబితాలో ఉన్నారు...