Warangalvoice

Top Stories

ఆందోళనకరంగా కరోరనా కేసులు
Today_banner, Top Stories

ఆందోళనకరంగా కరోరనా కేసులు

మాస్కులు తప్పనిసరి చేసిన తమిళనాడు వరంగల్ వాయిస్,చెన్నై: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ `19 కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది. అన్ని ఆసుపత్రుల్లోనూ ఏప్రిల్‌ 1 నుండి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులలో ఇన్‌ఫెక్షన్‌, క్రాస్‌`ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందన్న నిపుణుల హెచ్చరికతో.. అన్ని ఆసుపత్రులలోని ఇన్‌పేషెంట్‌, ఔట్‌ పేషెంట్‌ వార్డులలో వైద్యులు, మెడికోలు, ఇంటర్న్‌లు, నర్సులు, సాంకేతిక నిపుణులు, పరిపాలనా సిబ్బంది, రోగులు, అటెండర్లు అన్ని వేళలా మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనూ మాస్కులు తప్పనిసరి ధరించేలా డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ టీఎస్‌ సెల్వ వినాయగం జిల్లా ఆరోగ్య అధికారులను ఆదేశారు. నిబంధనలు పాటించాల...
రెండో వందేభారత్‌ రాక
Today_banner, Top Stories

రెండో వందేభారత్‌ రాక

ప్రధానికి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలుగు రాష్టాల్ర మధ్యన రెండవ వందేభారత్‌ రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్‌ 8 వ తేదీన సికింద్రాబాద్‌ నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌ ` తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌, తిరుపతి మధ్యన ప్రయాణానికి 11 నుండి 12 గంటల సమయం పడుతుండగా, వందేభారత్‌ రైలు ద్వారా కేవలం 8 గంటల30 నిముషాల్లోనే గమ్య స్థానికి చేరుకుంటుంది. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో రైలు ఆగనుంది.సాధారణ రోజుల్లో వందే భారత్‌ ట్రైన్‌ `నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. రెండో వందే భారత్‌ రైల్‌ కేటాయించినందుకు ...
కర్నాటకలో బిజెపి పప్పులు ఉడకకపోవచ్చు
Top Stories

కర్నాటకలో బిజెపి పప్పులు ఉడకకపోవచ్చు

కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం డబుల్‌ ఇంజిన్‌కు ఈ సారి ట్రబుల్‌ తప్పదంటున్న సర్వేలు వరంగల్ వాయిస్,బెంగళూరు: కర్నాటకలో త్వరలో జరగబోయే ఎన్నికలు బిజెపికి అంత సులువు కాదని స్థానిక పరిస్థితులు తెలియ చేస్తున్నాయి. బిజెపి నేతలు అవినీతితో కూరుకు పోవడం ఇప్పుడు అక్కడ చర్చగా మారింది. మిగతా రాష్టాల్రతో పోలిస్తే కర్నాకటలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో లాభం లేదన్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. 2008 ఎన్నికల్లోనూ, 2019లోనూ కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాలేదు. ఆపరేషన్‌ ఆకర్శక్‌తో గట్టెక్కి అంటే బలవంతంగానే అధికారాన్ని లాక్కున్నారని చెప్పక తప్పదు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ క్రమంలో మే 10న జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి పెద్ద పరీక్ష. దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక మాత్రమే. నిజానికి కర్నాటకలో ...
భూ అక్రమణల ఆరోపణలు సత్యదూరం
Top Stories

భూ అక్రమణల ఆరోపణలు సత్యదూరం

రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా మంత్రి సిదిరి అప్పలరాజు సవాల్‌ వరంగల్ వాయిస్,శ్రీకాకుళం: తనపై వస్తున్న భూ అక్రమణలపై మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటుగా స్పందించారు. తాను గానీ, తన అనుచరులు గాని ఎక్కడైనా ఇంచ్‌ భూమి ఆక్రమించామని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. తన టీం తప్పు చేసినా తాను తప్పు చేసినట్టే అని అన్నారు. పలాస నియోజకవర్గ పరిధిలో భూ ఆక్రమణలపై మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి స్పందన కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నాయకులు 600 కోట్ల రూపాయల విలువ గల భూములు కబ్జా అయ్యాయని విూడియా ముందు పదేపదే చెబుతున్నారు. ఆక్రమణ జరిగితే స్పందన కార్యక్రమంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. తన అనుచరులపై ఎవరైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన భార్యపై కూడా ఆరోపణలు చేస్తూ రాతలు రాస్తున్నారని ఆవే...
దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
Top Stories

దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కేసుల సంఖ్య వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్టాల్ల్రో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం రికార్డ్‌ స్థాయిలో ఒక్కరోజులో 300 కరోనా కేసులు నమోదైయ్యాయి. గత 6 నెలల తర్వాత మొదటి సారి రోజువారి కరోనా కేసులు 300 దాటాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదలపై మార్చి 30వ తేదీన గురువారం ఢిల్లీ ప్రభుత్వ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సౌరబ్‌ భరద్వజ్‌ కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఇక దేశంలో వారంరోజుల క్రితం వరకు వెయ్యికి పరిమితమైన రోజువారి కోవిడ్‌ కేసుల నమోదు.. తాజాగా 3 వేల మార్క్‌కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,016 కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో 24గంటల్లో దాదాపు 40శా...
మాతా శిశు మరణాలు తగ్గుముఖం
Top Stories

మాతా శిశు మరణాలు తగ్గుముఖం

దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం ఎర్రమంజిల్లో నిర్మించే 200 పడకల సంరక్షణ కేంద్రం శంకుస్థాపనలో మంత్రి హరీష్‌ రావు వెల్లడి వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రయివేటు రంగంలో కానీ 100 పడకల డయాలసిస్‌ యూనిట్‌ ఎక్కడా లేదు. నిమ్స్‌లో కేవలం 34 డయాలసిస్‌ బెడ్లు మాత్రమే ఉన్నాయి.. వాటిని 100కు పెంచుకుంటున్నాం. దీంతో దాదాపు 1500 మంది రోగులు డయాలసిస్‌ సేవలు పొందుతారని మంత్రి తెలిపారు. నిమ్స్‌కు అనుబంధంగా.. ఎర్రమంజిల్లో నిర్మించే 200 పడకల మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎంసీహెచ్‌ సూ...
రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభంజనం
Top Stories

రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభంజనం

వైసిపి అరాచాకాలతో విసిగిపోయిన జనం మాజీమంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ వరంగల్ వాయిస్,నంద్యాల: ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో అధికార వైసిపికి కౌంట్‌డౌన్‌ మొదలయ్యిందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. వైసిపి పాలనతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసిపికి చెల్లుచీటి పలకడం ఖాయమని అన్నారు. పులివెందుల గడ్డ నుంచే తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని ఎగురవేసిందని, జగన్‌ పతనం అక్కడి నుంచే మొదలైందని అన్నారు. జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత అరాచకంగా పాలన సాగించారో ప్రజలే కాకుండా, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలుసుకున్నారని అన్నారు. అధికార మదంతో టీడీపీ నాయకులను, కార్యకర్తలను వైసీపీ నాయకులు ఎంత వేధించారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వేళ్ల విూద లెక్కపెట్టే సీట్లు మాత్రమే వైసీపీకి రాబోతున్నాయన...
ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్న దళితబంధు
Top Stories

ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్న దళితబంధు

రైలు మిల్లును ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ విమోచనోత్సవంపై అమిత్‌ షా కామెంట్స్‌పై ఆగ్రహం వరంగల్ వాయిస్,సిరిసిల్ల: దళితబంధు దళితులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ పథకం ఎందరో జీవితాల్లో వెలుగు నింపడమే గాకుండా వారు కూడా ఆర్థికంగా పైకి రావడానికి తోడ్పాటును ఇస్తోందని అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్‌ మిల్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్దిదారులను రైస్‌ మిల్‌ యూనిట్‌ స్థాపన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనతరం మాట్లాడుతూ.. రైస్‌మిల్‌ను స్థాపించాలనుకోవడం గొప్పనిర్ణయమన్నారు. రైస్‌మిల్‌ యూనిట్‌ విజయవంతంగా నడవాలని, రాష్ట్రం మొత్తానికి ఇది ఆదర్శంగా నిలవాలని చెప్పారు. మిగతా లబ్దిదారులకు కేస్‌ స్టడీగా మారాలని ఆకాంక్షించారు. ªూయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదన...
ఆదానీ వ్యవహారంపై జెపిసికి డిమాండ్‌
Political, Top Stories

ఆదానీ వ్యవహారంపై జెపిసికి డిమాండ్‌

పార్లమెంటులో విపక్ష ఎంపిల ఆందోళన నల్ల చొక్కలాతో ఎంపిల నిరసన ఉభయసభలు వాయిదా వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంలో జెపిసి వేయాలని, కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు విధించి నందుకు నిరసనగా సోమవారం కాంగ్రెస్‌ ఎంపీలు నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు విధించడాన్ని నిరసిస్తూ.. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ విపక్ష ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించారు. లోక్‌సభలో కొందరు ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లా చైర్‌ను ముట్టడిరచారు. స్పీకర్‌ చైర్‌పై పేపర్లు చించి విసిరేశారు. ప్లకార్డులను కూడా విసిరేశారు. అయితే ఆందోళనల మధ్యలోనే స్పీకర్‌ బిర్లా సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు. తరవాత పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద...
బండి సంజయ్‌కు మారోమారు నోటీసులు
Telangana, Top Stories

బండి సంజయ్‌కు మారోమారు నోటీసులు

లీగల్‌గా చర్చిస్తామన్న బండి సంజయ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: బండి సంజయ్‌కు మరోసారి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇంటికి శనివారం ఉదయం సిట్‌ అధికారులు చేరుకున్నారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్‌ నోటీసులపై స్పందించిన బండి సంజయ్‌.. విచారణకు హాజరుకావాలా.. లేదా అనే అంశంపై తమ లీగల్‌ టీంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్‌ కు కట్టుబడి ఉన్నానని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో నమ్మలేని నిజాలున్నాయన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మూడు రోజుల క్రితం కూడా సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరై వివరాలు అందించాలని నోటీసుల్లో పేర్కొంది. బండి సంజయ్‌ తన నివాసంలో లేకపోవడంతో అక్కడే నోటీసులను అధికారులు అతికించారు. గ్రూప్‌`1లో బీఆర్‌ఎస్‌ నేతల పి...