Warangalvoice

Top Stories

హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ కు పరామర్శ
Top Stories

హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ కు పరామర్శ

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ తల్లి రాపోలు రామలక్ష్మమ్మ ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న అసైన్డ్ భూమి సమితి (ఏబీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందర్ మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలకోటి మహేందర్ మాట్లాడుతూ రాపోలు రామలక్ష్మమ్మ అందించిన స్ఫూర్తితోనే ఆమె కుమారుడైన రాపోలు భాస్కర్ రెండు తెలుగు రాష్ట్రాలలో గొప్ప న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి బాధితులకు ఉచితంగా న్యాయ సహాయం, సలహాలు, సూచనలు చేస్తూ తమలాంటి న్యాయవాదులకు ఆదర్శంగా నిలుస్తూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. ఆమె లేని లోటు కుటుంబానికి తీరనిదని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర...
మరోసారి కాంగ్రెస్ మార్క్ మోసం
Top Stories

మరోసారి కాంగ్రెస్ మార్క్ మోసం

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ వాయిస్, తొర్రూరు : మోసపూరిత మాటలతో రైతులను ఆగం చేస్తూ పరిపాలన చేతకాక కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు. తొర్రూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రైతులు ఎంతైనా వడ్లు పండించుకోండి రూ. 500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత నాది అని సరిగ్గా నెల రోజుల క్రితం ఏప్రిల్ 21న నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత సన్న వడ్లు పండించిన వారికి మాత్రమే రూ. 500 బోనస్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. తెలంగాణలో 90 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు మాత్రమే సాగు చేస్తారు. కేవలం 10 శాతం మంది రైతులు...
నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి
Top Stories

నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ వరంగల్ వాయిస్, కన్నాయిగూడెం : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరిత గతిన పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ అన్నారు. మంగళవారం కన్నాయిగూడెం మండలం లోని సింగారం, ఏటూరు, కంతనపల్లి గ్రామాలలోని పాఠశాలలలో జరుగుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ పి.శ్రీజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తరగతి గదుల్లోని లైట్ లు, ఫ్యాన్ల నిర్వహణను పర్యవేక్షించారు. మరుగుదొడ్లను పరిశీలించి, వాటిపై రూఫ్ ను, తలుపుల మరమ్మతులను సరైన విధంగా అమర్చాలని సిబ్బందిని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలకు వచ్చే విద్యార్దులకు పాఠశాల వాతావరణం ఒక నూతన అనుభూతిని కలిగించే విధంగా పాఠశాల పరిసరాలను ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల ప్రత్యేక అధికారి ఏపీడీ వెంకటనారాయణ, ఎంపీడీవో, ఎంఈవో రాజేష్, పంచాయతీర...
యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
Top Stories

యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ

లేబర్ పార్టీ అభ్యర్థిగా ఉదయ్ నాగరాజు నాగరాజుది ఉమ్మడి కరీంనగర్ జిల్లా శనిగరం వరంగల్ వాయిస్, కోహెడ : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తెలుగు బిడ్డ ఎంపికయ్యా రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలుస్తునారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ కాండిడేట్ గా పార్టీ ప్రకటించింది. “నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ “బౌండరీకమిషన్ “సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కు లస్ పక్రారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్ లోనూ ఎన్నికల హడావిడి మొదలైంది. భారతదేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ -పాలస్తీనా సంఘర్షణ, పప్రంచవ్యా ప్తంగా ఆర్థిక మ...
District News, Hanamkonda, Telangana, Top Stories

రైల్వే వర్క్ షాప్ పేరిట రాజకీయ పార్టీల డ్రామా

రైల్వే రిపేరు వర్క్ పేరిట ప్రజలను మోసంరాబోయే ఎన్నికల కోసం  పార్టీల స్టంట్కాజీపేట తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్  వరంగల్ వాయిస్, కాజీపేట : కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ (పి ఓ హెచ్), వ్యాగన్ తయారీ పరిశ్రమ విషయంలో గత నాలుగైదు రోజులుగా మీడియాలో, పత్రికలలో కాజీపేట ప్రాంత ప్రజలను అయోమయానికి గురిచేసేవిదంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు  ఈ పరిశ్రమల పైన అవగాహన లేకుండా, ఒక పెద్ద డ్రామాలు మాట్లాడుతున్నారన్నారు. అందుకే తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో  కాజీపేట రైల్వే ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో  ఏర్పాటు విలేకరుల సమావేశంలో కాజీపేట  తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్ కో, కన్వీనర్ పాక వేద ప్రకాష్ మాట్లాడుతూతెలంగాణ రైల్వే జాక్ 2011 పిబ్రవరి నెలలో ఆవిర్భావం రైల్వే సమస్యల పైన కాజీపేట జంక్షన్ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న విషయం ఈ ప్రాంతంలోని ప్రజానీకానికి తెలిసిందే అని, అప్ప...
రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ ….
District News, Telangana, Top Stories

రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ ….

జూన్ 28న జయంతి      రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పీవీకి పేరుంది.  పదవిని చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడిపించింది. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం ఆయన సొంతూరు. రుక్మిణి, సీతారామారావు తల్లిదండ్రులు. 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. పీవీ ప్రాథమిక విద్య వంగర, హన్మకొండలో సాగింది. 1936లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులయ్యారు. 1938లో నిజాం వ్యతిరేక పోరాటంలో పీవీ పాల్గొన్నారు. దీంతో ఆనాడు రాష్ర్టంలో ఎక్కడ చదవకుండా ప్రభుత్వం నిర్భంధం విధించింది. చదువుపై మమకారంతో మహారాష్ర్టలోని పూణేలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన పీవీ హైదరాబాద్ రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటు ప్రత్యేక మ...
20ఏళ్ళ వయస్సులోనే డాక్టర్ పట్టాపొందాడు
Today_banner, Top Stories

20ఏళ్ళ వయస్సులోనే డాక్టర్ పట్టాపొందాడు

ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవము ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాని 2007 ఏప్రిల్ 25న ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ దేశాన్ని కలిసి ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మలేరియా కారకాలను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి పొందిన రోనాల్డ్ రాస్ తన పరిశోధనలను హైదరాబాద్ కేంద్రంగానే నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు అంతే స్థాయిలో డాక్టర్ మల్లన్న క్లోరోఫామ్ ఇచ్చే పద్ధతులపై విశేషమైన పరిశోధన చేశారు. సమాజ సేవతో పాటు హైదరాబాద్‌లో వైద్య రంగంలో తనకంటూ పేరు సంపాదించుకుని అనేక వ్యాధులకు ఖచ్చితమైన నివారణ పద్ధతులను కనుగొన్న ఆయన తెలంగాణ ప్రజలందరికి ఆదర్శమూర్తి. తన తండ్రి ఇండియన్ మిలిటరీలో పనిచేస్తున్న కాలంలో మధ్యప్రదేశ్లో 1872 అక్టోబర్ 26న మల్లన్న జన్మించారు. తండ్రి రిటైరయిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అప్పటికే మెడికల్ విద్యకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌లోన...
అణగారిని వర్గాల ఆశాజ్యోతి
Top Stories

అణగారిని వర్గాల ఆశాజ్యోతి

నిఖార్సయిన దళితబంధు..బాబూ జగ్జీవన్‌ రామ్‌ వరంగల్ వాయిస్,పాట్నా: బాబుజీగా ప్రసిద్ది చెందిన జగ్జీవన్‌ రామ్‌ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళితబంధుగా చెప్పుకోవాలి. చరణ్‌సింగ్‌ తరవాత ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా ఎందుకనో ఆనాటి పరిస్థితులు అనుకూలించలేదు. అలా జరిగివుంటే ఓ దళితుడు దేశ ప్రధాని అయ్యారన్న చరిత్ర ఉండేది. ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్‌ 5న బాబూ జగ్జీవన్‌ రామ్‌ పుట్టారు. ఆయన తండ్రి శోబీరామ్‌, తల్లి వసంతిదేవి. బీహార్‌లోని షాహాబాద్‌( ఇప్పుడు భోజ్‌పూర్‌) జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. ఆయనకు అన్నయ్య సంత్‌ లాల్‌ తోపాటు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. మాజీ స్పీకర్‌ విూరా కుమార్‌ స్వయాన ఆయన కూతురే. 1936`1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు. అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరైన అతను ...
ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్వసాలు
Top Stories

ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్వసాలు

నవనీతకృష్ణాలంకారంలో రామయ్య ముగ్ధమనోహర రూపం వరంగల్ వాయిస్,ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం నవనీతకృష్ణాలంకారంలో రాములవారు ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్‌, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్నదొంగ. రేప్లలెలో బాలకృష్ణుడు యశోదమ్మ ఇంట్లోనే గాక అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న ఆరగించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీలలను గుర్తు చేస్తూ రాములవారు వెన్నకుండతో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్‌ బాబు, మాన్యుస్క్రిప్ట్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఏఈ...
తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు
Top Stories

తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు

శ్రీదేవీ సమేతంగా మాడవీధుల్లో ఊరేగిన శ్రీవారు మూడు రోజుల పాటు వివిధ సేవల నిలిపివేత వరంగల్ వాయిస్,తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 5 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌ 3 నుంచి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారుని ఆలయ నాలుగు మాడ వీధిలో ఊరేగించారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. వసంతోత్సవ అభిషేక నివేదన పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2...