Warangalvoice

Top Stories

బాధిత కుటుంబానికి చేయూత
Top Stories

బాధిత కుటుంబానికి చేయూత

శ్రీ వివేకానంద సేవ సంస్థ ఆర్థిక సాయం వరంగల్ వాయిస్, మొగిలిచెర్ల : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలోని శ్రీ వివేకానంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గత పది రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందిన చిలువేరు కమలాకర్ (35) కుటుంబాన్ని పరామర్శించారు. మృతిచెందిన కమలాకర్ కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయిలకు దాతల సహకారంతో ఆర్థిక సహకారాన్ని శ్రీ వివేకానంద సేవ సంస్థ అధ్యక్షుడు ఆడెపు రమేష్, ఉపాధ్యక్షుడు బిల్లా రమేష్, కోశాధికారి లెంకలపల్లి స్వామి, కునమల్ల రవి, కామకోని రఘుపతి, మాజీ సర్పంచి గణిపాక శ్రీనివాస్, గనిపాక స్వామి, సభ్యులు పాల్గొని రూ.13,016లతో పాటు 50 కేజీల బియ్యం అందజేశారు.  ...
భవన నిర్మాణంలో నిబంధనలు బేఖాతరు
Top Stories

భవన నిర్మాణంలో నిబంధనలు బేఖాతరు

వరంగల్ వాయిస్, పరకాల : పట్టణం నడిబొడ్డులోని కూరగాయల మార్కెట్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అతి భారీ భవనం నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పురపాలక అధికారులు కళ్లు మూసుకొని ఉండటం విశేషం. కారణం మామూళ్ల మత్తా? అధికార పార్టీ ఒత్తిడులా? అని ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతోంది. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే పరకాల బీజేపీ ఆధ్వర్యంలో పోరాటానికి చేయడానికి సమాయత్తం అవుతోంది. పరకాల పురపాలక సంఘం పరిధిలో జి ప్లస్ టు నిర్మాణాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అలాంటిది జీ ప్లస్ ప్లోర్ నిర్మాణం, ప్రమాదకరంగా సెల్లార్ నిర్మాణం జరుగుతున్న కూడా అధికారులకు ఇంత నిర్లక్ష్యమా అని పరకాల మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.  ...
బీజేపీ చొరవతో ప్రభుత్వ భూమికి రక్షణ
Top Stories

బీజేపీ చొరవతో ప్రభుత్వ భూమికి రక్షణ

వరంగల్ వాయిస్, పరకాల : పట్టణంలోని నూతన వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 95లో గల సుమారు1500 గజాల ప్రభుత్వ భూమి అన్యాకాంతం కాకుండా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వానికి,నూతన ప్రభుత్వానికి స్థానిక తహసీల్దార్, ఆర్డీవోలకు మెమోరాండం ఇచ్చి నిరసన తెలపడంతో అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడినందుకు పరకాల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ భూమిని ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, ఇందుకోసం తగిన చొరవ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రభారి దేవనూరి మేఘనాథ్, పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు మార్త భిక్షపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య, ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్, మాజీ పట్టణ అధ్యక్షుడు కానుగుల గోపి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి, 36వ బూత్ అధ్యక్షుడు...
గుజ్జుల ప్రేమేందర్ కు ఓటేయండి
Top Stories

గుజ్జుల ప్రేమేందర్ కు ఓటేయండి

వరంగల్ వాయిస్, ఆత్మకూర్ : మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులను బీజేపీ నాయకులు కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పెద్ద బ్లాక్ మెయిలర్, మల్లన్నకు గత ఎన్నికల్లో ఉన్న సానుభూతి ఇప్పుడు లేదన్నారు. అతడు ఒక అవకాశవాదని పట్టభద్రులు మొహమాటం లేకుండా చెబుతున్నారని అన్నారు. ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తామని మాట ఇస్తున్నారని తెలిపారు. మోసపోయి గోసపడ వద్దని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రతిపక్ష నాయకుడైతే ప్రజల తరఫున, నిరుద్యోగ సమస్యలపై శాసనమండలిలో అధికార పార్టీని నిలదీసి అడిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, మండల ఎమ్మెల్సీ బూత్ ఇంచార్జి ఉప్పుగళ్ల శ...
కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం
Top Stories

కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం

వరంగల్ వాయిస్, పరకాల : కాంగ్రెస్ పార్టీ బలపరచిన వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ, పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో శనివారం ఉదయం పరకాల పట్టణంలోని పట్టభద్రులను కాంగ్రెస్ నేతలు, నాయకులు కలిసి ప్రచారం చేశారు. బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండవ వరుసలోని తీన్మార్ మల్లన్న ఎదురుగా ఉన్న బాక్స్ లో మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ, కరపత్రం చూపిస్తూ ప్రచారం నిర్వహించారు. పరకాల మాజీ శాసన సభ్యుడు మొలుగూరి భిక్షపతి, పట్టణ ఇంచార్జి గుండపు చరణ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోయ్యడ శ్రీను, సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ, కోలుగురి రాజేశ్వర్ రావు, రంజాన్ అలీ, డాక్టర్. మడికొండ శ్రీను, మెరుగు శ్రీశైలం గౌడ్, చందుపట్ల రఘు, ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్, ఎర్రబెల్లి భా...
వృద్ధులకు సంచార వాహన వైద్య సేవలు
Top Stories

వృద్ధులకు సంచార వాహన వైద్య సేవలు

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ మెడికేర్ యూనిట్, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హసన్ పర్తి మండలం, పలివేల్పుల రోడ్డు, భీమారం గ్రామంలోని లార్డ్ అనాథ వృద్ధాశ్రమంలో వృద్దులకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్య శిబిరం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ : పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి : బొమ్మినేని పాపిరెడ్డిల ఆదేశానుసారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా పాలకవర్గం మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు హనుమకొండ రెడ్ క్రాస్ సంచార వైద్యశాల సేవలు ద్వారా బిపి. షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరిగిందని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో నారగోయినా నరేష్ గౌడ్, రెడ్ క్రాస్ డాక్టర్లు : డా. జె.కిషన్ రావు, డా.మొహమ్మద్ తాహెర్ మసూద్, రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్, ఉపేందర్, అనిల్, నర్సింహా చా...
విత్తనాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు
Top Stories

విత్తనాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, వరంగల్ : విత్తనాలు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విత్తనాలు షాప్ ల వద్ద బార్లు తీరుతున్నారు. దీంతో షాప్ యజమానులు ఇష్టారీతిన ఎక్కువ ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నా వ్యవసాయ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా డీఆర్ఓ శ్రీనివాసులు ను కలిసి అగ్రికల్చర్ వాళ్లు పర్యవేక్షణ చేయడం లేదని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కన్వీనర్ సోమీడి శ్రీనివాస్, సోమ రామ్మూర్తి సంఘ సలహాదారులు మాట్లాడుతూ 1993 సంవత్సరం కాలం నుంచి డాంకల్ ప్రతిపాదన అనే పేరుతో బహుళ జాతి కంపెనీల విత్తనాలను దిగుమతి చేస్తూ రైతులకు దిగుబడులు పెరుగుతాయని పాలకులు చెబుతూ వస్తున్నారు. కానీ ఆ కాలంలో విత్తనాలు ఎలాంటి కల్తీ లేకుండా తమ విత్తనాన్ని తామే తయారు చ...
దేశాభివృద్ధి కోసం మోడీని గెలిపించాలి
Top Stories

దేశాభివృద్ధి కోసం మోడీని గెలిపించాలి

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : దేశ రక్షణ, సమగ్రత కోసం బీజేపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మొదటిప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెడవెల్లి రాజవర్థన్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆపార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నికలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని, నేటికి ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉందన్నారు. ప్రధాని మోడీ వరంగల్‌కు రైల్వే కోచ్‌ను మంజూరు చేసి దాని నిర్మాణం కోసం రూ.800 కేటాయించారని చెప్పారు. గిరిజన యూనివర్శిటీతో పాటు రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని పునఃప్రారంభించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500 ఇస్తామని నేట...
లైబ్రరీలో యూత్ కాంగ్రెస్ ప్రచారం
Top Stories

లైబ్రరీలో యూత్ కాంగ్రెస్ ప్రచారం

వరంగల్ వాయిస్, హనుమకొండ : పట్టభద్రుల ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం 11వ డివిజన్ లో ఉన్న వరంగల్ రీజినల్ లైబ్రరీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమకారులను అందరిని తీన్మార్ మల్లన్న ఓటు వేసి చట్టసభలకు పంపాలని కోరారు. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని లైబ్రరీలో ఉన్న విద్యార్థులను నిరుద్యోగులను కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అల్వాల కార్తీక్, 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాన్నారపు సంగీత్,11వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ లక్ష్మి సురేందర్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమ, వినయ్ కుమార్, గోవిందు, శ్వేత, కాంగ్రెస్ ప...
పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
Top Stories

పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి

ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణలో ఉమ్మడి నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పట్టభద్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అనిల్ గుర్తుచేశారు. నేడు ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో అలోచించి ప్రజలపక్షాన ప్రశ్నించే బీఆర్ఎస్ గొంతుకు మద్దతుగా నిలిస్తే కేవలం పట్టభద్రుల సమస్యల కోసమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు అండగా ఉండి పోరాడుతారని కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్‌రెడ్...