Warangalvoice

Top Stories

విత్తన కొనుగోళ్లపై రైతులకు అవగాహన
District News, Top Stories

విత్తన కొనుగోళ్లపై రైతులకు అవగాహన

వరంగల్ వాయిస్, మల్హర్ : మరి కొన్ని రోజుల్లో వర్షాకాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల రైతులకు మండల వ్యవసాయ అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో ఏఈవోలు విత్తన కొనుగోలు అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తన ప్యాకెట్, రశీదు పంట కాలం పూర్తి అయ్యే వరకు భద్రపరచుకోవాలని, లూజు గా ఉన్న విత్తన ప్యాకెట్లు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని ఈ సందర్బంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు అనూష, శిరీష, మనీషా, రైతులు పాల్గొన్నారు.  ...
లోగో మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
Political, Top Stories

లోగో మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వరంగల్ వాయిస్, బాలసముద్రం : తెలంగాణ లోగో మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. కాకతీయ తోరణం, చార్మినార్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ఇముడింప చేసేలా ఉన్న గుర్తులను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రజల అభీష్టం మేరకు పాలన కొనసాగించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లోగో మార్పు నిర్ణయం వెనక్కి తీసుకొని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నయిమోద్దీన్, చాగంటి రమేష్, బొల్లు రవి, ఎండీ మహమూద్, సంపత్, ఇస్మాయిల్, సందీప్, రాజేశ్వర్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.  ...
స్వయంకృషి వృద్ధాశ్రమంలో ఆరోగ్య శిబిరం
Top Stories

స్వయంకృషి వృద్ధాశ్రమంలో ఆరోగ్య శిబిరం

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ మెడికేర్ యూనిట్, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో గురువారం ములుగు రోడ్ దగ్గర ఉన్న స్వయంకృషి వృద్ధాశ్రమంలో వృద్దులకు సంచార వాహన వైద్య సేవల ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఈవీ శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యుడు బిల్లా రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు హనుమకొండ రెడ్ క్రాస్ సంచార వైద్యశాల సేవలు ద్వారా బీపీ, షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరిగిందని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డా.జె.కిషన్ రావు, డా.టి.మదన్ మోహన్ రావు, బాబు రావు, సాంబయ్య, స్వయంకృషి ప్రెసిడెంట్ శుభ, భాగ్యమ్మ, అనిత, సుగుణ రాధా, అనూష, ప్రవిత, రమ, రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్, సాగర్, అనిల్, కె.రమేష్, రాజు ...
కమ్యూనిస్టులే దేశానికి ప్రత్యామ్నాయం
Top Stories

కమ్యూనిస్టులే దేశానికి ప్రత్యామ్నాయం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి వరంగల్ వాయిస్, జఫర్ గడ్ : కమ్యూనిస్టులే దేశానికి సరైన ప్రత్యామ్నాయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. గురువారం జఫర్ గడ్ మండల కేంద్రంలో జనగామ జిల్లా పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణా తరగతులలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు, మండల కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన శిక్షణా తరగతుల ప్రారంభ సమావేశానికి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న అధ్యక్షత వహించగా తక్కళ్లపల్లి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాల బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కులం, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు కాలం చెల్లిందన్నారు. లౌకిక దేశమైన భారత దేశంలో మత రాజకీయాలు, మతోన్మాద శక...
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పూర్తిచేయాలి
Top Stories

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పూర్తిచేయాలి

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వరంగల్ వాయిస్, రేగొండ : జూన్ 10లోపు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శనివారం మండలంలోని బాగిర్తిపేట, గూడెప్పల్లి, మడత పల్లి, రంగయ్యపల్లి, గోరి కొత్తపల్లి మండలంలోని రూపిరెడ్డిపల్లి, చిన్న కోడెపాక గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాధమిక, ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకునేందుకు అనువుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పనకు మరమ్మత్తు పనులు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఒక్క పని పెండింగ్ లేకుండా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మండలంలో 26 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ. కోటి 17 లక్షలతో పనులు చేపట్టినట్లు ఆయ...
కన్న కొడుకుని హతమార్చిన కసాయి తండ్రి
Top Stories

కన్న కొడుకుని హతమార్చిన కసాయి తండ్రి

హత్య కేసును ఛేదించిన పోలీసులు మర్డర్ కేసులో నిందితుడు అరెస్ట్ వరంగల్ వాయిస్, రేగొండ : వ్యాపారం దివాలా తీయడానికి కారణం కన్నకొడుకేనని, చెప్పిన మాట వినడం లేదని కన్న తండ్రి కసాయిగా మారి కొడుకును హతమార్చిన ఘటనను పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎస్సై ఎన్ రవికుమార్ లు విలేకరుల సమావేశం నిర్వహించి హత్య వివరాలను వెల్లడించారు. రేగొండ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పెరుగు లింగమూర్తి కుమారుడు సాయి గణేష్ గత ఏడాది నవంబర్ నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అప్పటి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం వివరాలలో అనుమానం రావడంతో విచారణ చేపట్టగా హత్య విషయం వెల్లడైనట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. విచారణ చేపట్టగా మృతుడి తండ్రి చేసినట్లు నిర్ధారణ కావడంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వివరాల్లోకి వ...
మానుకోటలో దొంగల బీభత్సం
Mahabubabad, Top Stories

మానుకోటలో దొంగల బీభత్సం

తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ భారీగా నగదు, బంగారం అపహరణ వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : దొంగలు తాళం వేసి ఉన్న రెండు ఇళ్ల తాళాలు పగల గొట్టి నగదు, ఆభరణాలు చోరీకి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న బానోత్ వెంకటేశ్వర్లు-అనిత దంపతులు తమ స్వగ్రామం రెడ్డిగూడెంలో రైస్ మిల్లు నిర్మాణం చేపట్టేందుకు రూ.4 లక్షల 70 వేలు అప్పుగా తెచ్చి ఇంట్లోని డ్రెస్సింగ్ టేబుల్ లో దాచి పెట్టారు. రాత్రి హాస్పిటల్ లో విధులు నిర్వహించేందుకు దంపతులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. విధులు ముగించుకొని మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటికి వేసిన తాళం పగలగొట్టి కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా డ్రెస్సింగ్ టేబుల్ లో దాచి ఉంచిన రూ.4లక్షల 70 వేలు చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ...
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
Top Stories

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి

కలెక్టర్ సిక్తా పట్నాయక్ వరంగల్ వాయిస్, హనుమకొండ : ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం, వసంతపూర్ గ్రామాల్లో ఓరుగల్లు డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుండగా శనివారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, తూకం వేసిన ధాన్యం తరలింపు, తదితర వివరాలతో పాటు తేమశాతం ఎంత తీస్తున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ఎంత ధాన్యాన్ని తూకాలు వేయాల్సి ఉందని కలెక్టర్ ఆడిగారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల...
12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేయచ్చు
Top Stories

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేయచ్చు

కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. ప్రావీణ్య వరంగల్ వాయిస్, వరంగల్ : ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిక్ కార్డు లేని వాళ్లు ఆధార్ కార్డు, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ జాబ్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ వారిచే జారీ చేసిన పాస్ పుస్తకాలు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్.పి.ఆర్. కింద ఆర్ జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫొటోతో జారీ చేసిన ఐడీ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జా...
బాధిత మహిళకు న్యాయం చేయాలి
Top Stories

బాధిత మహిళకు న్యాయం చేయాలి

భూక్యా సరితను మోసం చేసిన రాముని శిక్షించాలి డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ వరంగల్ వాయిస్, కమలాపూర్ : నిరుపేద ఎస్టీ లంబాడి సామాజిక వర్గానికి చెందిన వికలాంగ మహిళ భూక్య సరితను మొదటి వివాహం చేసుకొని తనతో కూతురిని కనీ ఆమెకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకొని మోసం చేసి తప్పించు తిరుగుతున్న పూలాంటి రాముపై చర్య తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధిత మహిళా కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమలాపూర్ గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న కమలాపూర్ వాసి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పులాంటి రాము హనుమకొండ బాలసముద్రంలో నివాసముంటున్న భూక్య సరితను మాయ మాటలు చెప్పి లోబర్చుకొని మొదటి వివాహం చేసుకొని ఆమ...