Warangalvoice

Top Stories

ఉపాధి హామీ పథకంపై నిర్లక్ష్యం
Top Stories

ఉపాధి హామీ పథకంపై నిర్లక్ష్యం

అధికారులు తీరుపై విమర్శలు వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : మండలంలోని కడారి గూడెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంపై గ్రామస్తులు వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. గ్రామస్తులకు కావలసిన పనులు చేపట్టకుండా గ్రామానికి కావలసిన పనులను నిర్ణయించి వాటిపై గ్రామస్తులతో, కార్మికులతో చర్చించకుండా పనులు చేపట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామం నుంచి చెరువులోకి వెళ్లే నీరుని సజావుగా వెళ్లనీయకుండా ఆపుతున్న కాలువను సక్రమంగా తీర్చిదిద్దకుండా దానిని నిర్లక్ష్యం చేస్తూ అనవసరంగా చెరువులో బొందలు తీస్తూ ఆ మట్టిని తరలిస్తూ వృధా చేస్తున్నారని, దీంతో ఎటువంటి ఉపయోగం ఉండదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత వర్షాకాలంలో అతివృష్టి కారణంగా వరదలు ఎక్కువగా వచ్చి వరద చెరువులోకి వెళ్లే దారి లేకుండా చెరువు పక్కనే ఉన్న ఇండ్లు మునిగిపోవడం వల్ల ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. ఆ కాలువలను శుభ్రం చేసి...
శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో అన్నదానం
Top Stories

శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో అన్నదానం

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : అమావాస్యను పురస్కరించుకొని గురువారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని శ్రీ మహాదేవ స్వామి దేవాలయంలో శివుడికి, గణపతికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన పూజారి పిండిపోలు శ్రీనివాస్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ కూరెళ్ల పెద్ద ఉపేందర్ గుప్తా-రేణుక దంపతుల ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. గోలి శంకరయ్య-లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోలి వీరన్న-రజిత, అల్లుళ్లు అంజయ్య-వీరమణి, కూరేళ్ల ఉపేందర్-రేణుక దంపతుల ఆధ్వర్యంలో ప్రజలకు భక్తులకు అన్నదానం చేశారు. గందె బుచ్చయ్య విజయలక్ష్మిల జ్ఞాపకార్థం వారి కుమారుడు గందె మంజుల శ్రవణ్ కుమార్ స్వీట్ ను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ ప్రతినెల అమావాస్య రోజున ఆలయంలో పూజలు, అర్చనలు, అభిషేకాలు, అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక స...
కొత్త చట్టాలపై అవగాహన అవసరం
Hanamkonda, Top Stories

కొత్త చట్టాలపై అవగాహన అవసరం

సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : జులై 1 నుంచి అమలు కానున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్క పోలీసు అధికారికి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ పోలీస్ అధికారులు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా విడతల వారీగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా స్థానిక ములుగు రోడ్డులోని ఎల్ బీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులను సెంట్రల్ జోన్ డీసీపీ ముఖ్యం అతిధిగా హాజరై శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. వరంగల్, హనుమకొండ డివిజన్లకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ జులై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా జులై 1 నుంచి కొత్త చట్టాలను అను...
అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ
Hanamkonda, Top Stories

అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డికాలనీలోని అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదానం కోసం అసోసియేషన్ బాధ్యుడు పెద్దోజు వెంకటచారి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలో 35వ సారి రక్తదానం చేశాడు. ఈ కార్యక్రమంలో షణ్ముఖ చారి, వేణు, రాము, సర్వేశ్వర్, రాజు, రవీందర్, సిద్దోజు రాకేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు....
చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుదాం
Mulugu, Top Stories

చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుదాం

డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య వరంగల్ వాయిస్, ములుగు : చిన్న పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా బుధవారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ములుగు మండలం రాయిని గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జంగాలపల్లి, కొత్తూరు, సర్వాపూర్ సబ్ సెంటర్ లతో పాటు రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా చేశారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలలో దాదాపుగా 15 మంది పిల్లలకు టీకాలు ఇవ్వడం తనిఖీ చేశారు. దీంతో పాటు ప్రతి ఆశలకు, ఏఎన్ఎంలకు ముందుగా ప్రతి గర్భిణీ స్త్రీని నమోదు చేసి డెలివరీ అయ్యి నెలన్నర రోజులు వరకు తల్లి పిల్లలను చూసుకోవలసిన బాధ్యత మన ఆరోగ్య శాఖ సిబ్బందికి ఉందని తెలిపారు. అలాగే, మున్ముందు వర్షాకాలం ప్రారంభం కాబోతున్నందున కాలానుగుణంగా వచ్చే వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆశలకు, ఏఎన్ఎంలకు తగు సూచనలు చేయడం జరిగింది. మార్గమధ్యలో బావి తీస్తున్న కూలీలు కనపడగా అది ఒంటిగంట ...
లక్ష మందికి మజ్జిగ పంపిణీ
Top Stories, Warangal

లక్ష మందికి మజ్జిగ పంపిణీ

వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో మేదరి వాడ కార్యాలయం ముందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మజ్జిగ, అన్నదానం, ఉప్మా, అరటిపండు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం 60 రోజులు 85 మంది దాతలు 2,700 కిలోల మజ్జిగ పెరుగు, ఆరువేల లీటర్ల వాటర్, మూడు క్వింటాల అన్న వితరణ వీటన్నిటిని సుమారు 60 రోజుల్లో లక్ష మందికి పంపిణీ చేయడం గర్వకారణమన్నారు. సుమారు రెండు నెలపాటు నగరంలో ఉండే ప్రముఖులు, వైశ్యులు వారి వారి పుట్టినరోజులు, పెళ్లిరోజు, అదేవిధంగా జ్ఞాపకార్థం గుర్తు చేస్తూ పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కష్టపడి పనిచేసిన ఆర్యవైశ్య మిత్రబృందం నాయకత్వాన్ని సన్మానించారు. ఈ కార్...
పర్యావరణ పరిరక్షణలో మానవ పాత్ర గొప్పది
Hanamkonda, Top Stories

పర్యావరణ పరిరక్షణలో మానవ పాత్ర గొప్పది

వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, ది.నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన స్వధార్ మహిళా ఆశ్రమంలో పర్యావరణ పరిరక్షణలో మానవ పాత్ర అను అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు డాక్టర్ అనితా రెడ్డి బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి, పర్యావరణను కాపాడుకోకపోతే రానున్న కాలంలో జీవించడం కష్టమన్నారు. మన జీవన విధానాలతో పర్యావరణం కాలుష్యమవుతుందని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగం, చెట్లను నరకడం వలన అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఆధునిక యంత్రాలు వినియోగం పెరగడం, నియంత్రణ లేకపోవడం, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు అధికంగా వాడటం తద్వారా, భూగోళం వేడెక్కి జీవరాశులకు పెద్ద ముప్పు వాటిల్లుతుందని పేర్క...
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి
Top Stories, Warangal

ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల శరత్ వరంగల్ వాయిస్, వరంగల్ : జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, అనుమతి లేని కళాశాలల జాబితా విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఇంటర్ విద్యాశాఖ అధికారి డీఐఈఓ మాధవ్ రావుకు ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్ వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టి, ప్రైవేట్, కార్పోరేట్ కళాశాలల్లో వసూలు చేస్తున్నఅధిక ఫీజులను నియంత్రించి, ప్రభుత్వ అనుమతి లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేసి, ఇంటర్ నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అభిరామ్, శివ, రాకేష్ పాల్గొన్నారు....
రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి
Top Stories, Warangal

రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి

పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచర్ల బాలరాజు వరంగల్ వాయిస్, వరంగల్ : అఖిలభారత రైతుకూలీ సంఘం నర్సంపేట డివిజన్ కార్యవర్గ సమావేశం బుధవారం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు గట్టి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటే రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి ఆచరించలేకపోయింది. పైగా, ఆగస్టు 15లోపు అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటికే రైతులు అప్పుల బారిన పడి బ్యాంకులిచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో గత 40 సంవత్సరాలుగా గిరిజన గిరిజన పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారన...
కార్మిక వర్గం హక్కులను కాపాడేదే సీఐటీయూ
Top Stories, Warangal

కార్మిక వర్గం హక్కులను కాపాడేదే సీఐటీయూ

ముక్కెర రామస్వామి జిల్లా కార్యదర్శి వరంగల్ వాయిస్, వరంగల్ : సీఐటీయూ 54 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీమాబాదు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నూతన జెండాను సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భవించి నేటికి 54 సంవత్సరాలు అవుతుందన్నారు. ఐక్యత పోరాటం అనే నినాదాన్ని ఐదు దశాబ్దాల నుంచి ఆచరణలో పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. ముఖ్యమైన నినాదాన్ని ఆచరణలో అమలు చేసేందుకు అవిశ్రాంతంగా సీఐటీయూ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందన్నారు. దేశంలోనే ట్రేడ్ యూనియన్ ఉద్యమం ప్రారంభంలో సీఐటీయూ ఒంటరి అయినప్పటికీ ప్రయత్నాలు అధిగమించడమే కాకుండా నేడు కార్మిక వర్గానికి కాపాడడం, ఐక్య ఉద్యమాలను అభివృద్ధి చేయడంలో, కార్మిక వర్గం హక్కులు, వేతనాలు, ప్రయోజనాలను, పని పరిస్థితులను మెరుగుపరచడంలో ఛాంపియన్ గా సీఐటీయూ ముందు నిలిచి...