Warangalvoice

Top Stories

Raja Singh: మా జోలికొస్తే వదలం..అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ మాస్ వార్నింగ్
Top Stories

Raja Singh: మా జోలికొస్తే వదలం..అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ మాస్ వార్నింగ్

Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు. లేదా తాను బీజేపీలో జాయిన్ అవుతానని అసదుద్దీన్ ఒవైసీ తమ నేతల కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రంజాన్ సందర్బంగా అసదుద్దీన్ ఒవైసీ లేనిపోని కామెంట్స్ చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.యూపీ తరహాలో తెలంగాణలో కూడా జమ్మికి నమాజ్ చేస్తే బాగుంటుంది అన్న యోగి ఆదిత్యనాథ్ మాటలకు అసదుద్దీన్ ఓవైసీకి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హోలీ ప్రశాంతంగా జరగకూడదని అసద్దుద్దీన్ ఒవైసీ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ల...
MLC Kavitha | ఓయూలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
Top Stories

MLC Kavitha | ఓయూలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

MLC Kavitha | జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మార్గదర్శకత్వంలో కవితక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్, నిరాహార దీక్షలు, సకల జనుల సమ్మె, రైలు రోకో, బతుకమ్మ పండుగ, సడక్ బంద్ తదితర ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలను చైతన్య పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండు...
MLA jagadish reddy | శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్
Top Stories

MLA jagadish reddy | శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్

MLA jagadish reddy | తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెన్ష‌న్ చేస్తూ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెన్ష‌న్ చేస్తూ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌భ నుంచి జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పేర్కొన్నారు. దీంతో బడ్జెట్ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు జ‌గ‌దీశ్ రెడ్డి స‌భ‌కు హాజ‌రు కాలేరు. జ‌గ‌దీశ్ రెడ్డిని స‌స్పెండ్ చేయాల‌ని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు అసెంబ్లీలో ప్ర‌తిపాద‌న చేశారు. స‌భ నుంచి వెంట‌నే వెళ్లాల‌ని జ‌గ‌దీశ్ రెడ్డిని స్పీక‌ర్ ఆదేశించారు. జ‌గ‌దీశ్ రెడ్డి స‌స్పెన్ష‌న్‌పై బీఆర్ఎస్ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం ఇ...
Harish Rao | అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ : హ‌రీశ్‌రావు
Top Stories

Harish Rao | అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ : హ‌రీశ్‌రావు

Harish Rao | తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. అబ‌ద్దాల‌కు, అస‌త్యాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయట అవే అబద్దాలు చెబుతున్నాడ‌ని మండిప‌డ్డారు. 13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టీవీవీపీ విభాగంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా? డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది మీ కళ్లకు కనిపించడం లేదా? ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి. పెంచిన జీతాలు, అలవెన్సుల మాట ...
TG Assembly: దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు..
Top Stories

TG Assembly: దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం చెందారు. దీంతో జగదీష్ రెడ్డి బే షరతుగా సభాపతికి క్షమాపణ చెప్పాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి  అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్  గడ్డం ప్రసాద్  మనస్తాపం చెందారు. ఈ క్రమంలో మంత్రులు సభాపతితో భేటి అయ్యారు. జగదీష్ రెడ్డి వ్యవహారంపై స్పీకర్‌తో చర్చిస్తున్నారు. జగదీష్ రెడ్డి బే షరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ.. దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజ...
journalist Revathi: మహిళా జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్.. సంచలనం రేపుతున్న ఘటన..
Top Stories

journalist Revathi: మహిళా జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్.. సంచలనం రేపుతున్న ఘటన..

సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన మహిళా జర్నలిస్టుకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు జర్నలిస్టు రేవతిపాటు మరో మహిళను చంచల్ గూడ జైలుకు తరలించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మహిళా జర్నలిస్ట్ రేవతికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రేవతితోపాటు బండి సంధ్యను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిద్దరికీ ఈనెల 26 వరకూ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విచారణ సందర్భంగా రేవతి రిమాండ్‍ను రిజక్ట్ చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఉద్దేశపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారని, ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ న్యాయమూర్తి దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్లారు. రేవతిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. పీపీ వాదనలకు ఏకీభవించిన...
Revanth criticizes KCR family: కేసీఆర్ ఫ్యామిలీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సీఎం రేవంత్
Top Stories

Revanth criticizes KCR family: కేసీఆర్ ఫ్యామిలీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సీఎం రేవంత్

Revanth criticizes KCR family: 1,532 మందికి లెక్చరర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందని గ్రహించాలన్నారు. 55 రోజుల్లోనే 11 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేశామన్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు సీఎం. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటల ప్రకారం 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టామని గర్వంగా చెబుతున్నామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర...
KTR | రేవంత్‌కు దమ్ముంటే దావోస్‌ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలి.. కేటీఆర్‌ డిమాండ్‌
Top Stories

KTR | రేవంత్‌కు దమ్ముంటే దావోస్‌ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

KTR | రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి, ప్రభుత్వానికి దమ్ముంటే దావోస్‌ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. KTR | రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి, ప్రభుత్వానికి దమ్ముంటే దావోస్‌ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అమలు చేయకుండా.. 420 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ కొత్త ప్రాజెక్టుకు ఇటుక పెట్టకుండా 1.62లక్షలకోట్ల అప్పు చేసినందుకు గవర్నర్‌ ఏమన్నా మందలిస్తరేమోనని రేవంత్‌రెడ్డిని అనుకుంటే.. అక్కడ కూడా గాంధీభవన్‌లో ప్రస...
Osmania University | రాష్ట్ర బడ్జెట్లో ఓయూకు రూ. 1000 కోట్లు కేటాయించాలి..
Top Stories

Osmania University | రాష్ట్ర బడ్జెట్లో ఓయూకు రూ. 1000 కోట్లు కేటాయించాలి..

Osmania University | ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్,  ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓయూ విద్యార్థులకు సీఎం ఫెలోషిప్ పథకం ప్రకటించాలని కోరారు. ఓయూ విద్యార్థులకు ఉచిత మెస్ వసతితో పాటు, ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని అన్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయిం...
MLC Elections | 56వేల ఉద్యోగాలు ఇచ్చినా.. గ్రాడ్యుయేట్లు ఎందుకు ఓటు వేయలేదో.. కాంగ్రెస్‌ నేత ఆవేదన
Top Stories

MLC Elections | 56వేల ఉద్యోగాలు ఇచ్చినా.. గ్రాడ్యుయేట్లు ఎందుకు ఓటు వేయలేదో.. కాంగ్రెస్‌ నేత ఆవేదన

Nizamabad | ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో నుడా చైర్మన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ వాయిస్,  కంఠేశ్వర్ : ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో నుడా చైర్మన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం అన్ని విధాలుగా అభివృద్ధి చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడం నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక 56 వేల ఉద్యోగాలు ఇచ్చినా పట్టభద్రులు ఎందుకు ఓటు వేయలేరో అన...