Warangalvoice

Top Stories

గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ
Top Stories

గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాఫూలే, మైనార్టీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పకుండా అమలు చేయాలని తహసీల్దార్ సూచించారు. ఈ తనిఖీలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ఆమె వెంట ఉన్నారు....
సీఎం రేవంత్ ను స్వాగతం పలికిన కాంగ్రెస్ నేత బిల్లా..
Top Stories

సీఎం రేవంత్ ను స్వాగతం పలికిన కాంగ్రెస్ నేత బిల్లా..

వరంగల్ వాయిస్, దామెర:హన్మకొండ కి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,జిల్లా కాంగ్రెస్ నాయకులు బిల్లా రమణా రెడ్డి పార్టీ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
Top Stories

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంఒకరికి తీవ్ర గాయాలుఎదురెదురుగా ఢీకొన్న బైకులువరంగల్ వాయిస్, ఆత్మకూరు : మండలంలోని దుర్గపేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం రెండు బైక్‌లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఆరూరి అశోక్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దామెర మండల బీజేపీ పార్టీ అధ్యక్షడు నాగరాజును స్థానికులు హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు....
వ్యక్తి నిర్మాణమే ఆర్ఎస్ఎస్ సంఘ లక్ష్యం
Top Stories

వ్యక్తి నిర్మాణమే ఆర్ఎస్ఎస్ సంఘ లక్ష్యం

వరంగల్ వాయిస్  దామెర:ఆర్.ఎస్.ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా   హనుమకొండ జిల్లా దామెర మండల శాఖ దుర్గం పేట గ్రామ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్  శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిన సందర్భంగా  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  నాయిని  సంపత్ రావుఆర్.ఎస్.ఎస్ వరంగల్ విభాగ్ బాధ్యులు  రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంపత్ రావు  మాట్లాడుతూసమాజ అభివృద్ధికి ఆర్.ఎస్.ఎస్ లాంటి స్వచ్ఛంద సంస్థ ప్రతి గ్రామంలో అవసరం ఉందని ప్రతి ఒక్కరూ సంఘంలో చేరి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు  కావాలని పిలుపునిచ్చారు. లక్ష్మణ్ సుధాకర్ మాట్లాడుతూ అనైక్యత కారణంగానే భారత్ అనేక శతాబ్దాలపాటు బానిసత్వంలోకి  నెట్టి వేయబడిందని. మన చరిత్రను తెలుసుకొని, స్ఫూర్తిని మేల్కొలిపి,  ఏకాగ్రతను సాధించడం ప్రతి స్వయంసేవకుడి బాధ్యత అని పేర్కొన్నారు. వ్యక్తి నిర్మాణమే సంఘ ప్రధాన లక్ష్యం...
ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి
Top Stories

ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి

దామెర ఎంపీడీవో కల్పనవరంగల్ వాయిస్, దామెర : రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణపై శుక్రవారం దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌లో పీఓ (ప్రిసైడింగ్ ఆఫీసర్లు), ఏపీఓలకు (అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గుమ్మడి కల్పన మాట్లాడుతూ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. అనంతరం జరిగిన పోలింగ్ ఆఫీసర్ల శిక్షణ సమావేశంలో, నామినేషన్ల ఫారాల పరిశీలన, పూరింపు తదితర ముఖ్య విషయాలను శిక్షకులు క్షుణ్ణంగా వివరించారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల విషయంలో, వాటికి గల కారణాలను స్పష్టంగా వివరించాలని శిక్షకులు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన విధంగానే అధికారులు తమ విధులను నిర్వహించాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ రంగాచారి, ప్రొసీడింగ్ ఆ...
దసరా సెలవుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
Top Stories

దసరా సెలవుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి

వరంగల్ వాయిస్, దామెర:దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వుండాలని ఎస్సై అశోక్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళుoడడంతో ఇండ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీయ రక్షణ కోసం మీ ఇండ్లల్లో సీసీ 5 కెమెరాలను అమర్చుకోవాలని, ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటిని, పరిసరాలను ప్రత్యక్షంగా చూసుకోవచ్చన్నారు. సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే 100కు కాల్ చేయాలని కోరారు. ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుందని తెలిపారు....
ఎంగిలిపూల సంబురం
Top Stories

ఎంగిలిపూల సంబురం

వరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఓగ్లాపూర్ గ్రామ లో శివాలయం  వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు స్పెషల్ ఆఫీర్   రంగాచారి  పంచాయతీ కార్యదర్శి  ఇంజపెల్లి నరేష్ ఏర్పాట్లు  ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు  ఆటపాటలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మహిళలు తీరొక్కా పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటల పాటలతో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. వివిధ దేశాలలో ఉంటున్న తెలంగాణ రాష్ట్ర మహిళలు కూడా బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకుంటున్నారంటే తెలంగాణలోని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా వ్యాపించిందని అన్నారు.  పితృ అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ మహిళ...
విద్యార్థులనైపుణ్యాభివృద్ధికి ఎన్ఎస్ఎస్ దోహదపడుతుంది
Top Stories

విద్యార్థులనైపుణ్యాభివృద్ధికి ఎన్ఎస్ఎస్ దోహదపడుతుంది

వరంగల్ వాయిస్, దామెర:జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాల హనుమకొండ యూనిట్ వన్, యూనిట్ టు ఆధ్వర్యంలో దామెర గ్రామంలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి హాజరై ప్రారంభించి మాట్లాడుతూ జాతీయ సేవా పథకం నిర్వహించే శిబిరాల ద్వారా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు నైపుణ్యాల అభివృద్ధి కి దోహాదపడుతుందని అన్నారు. దామెర గ్రామాన్ని ఎంచుకొని సమాజసేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు అభినందించారు. ఎంపీడీవో కల్పన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న రుక్మతలను రూపుమాపడానికి ముందుకు రావడం గర్వనీయం అన్నారు.ఏడు రోజులు గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక అంశాల పట్ల అవగాహన చేసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈ...
డిస్నీల్యాండ్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
Top Stories

డిస్నీల్యాండ్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

వరంగల్ వాయిస్, దామెర:సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని డిస్నీల్యాండ్ హై స్కూల్ ఒగ్లాపూర్ లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఉన్న 200 మంది  విద్యార్థినిలు మరియు 650 మంది  విద్యార్థులు పాల్గొన్నారు.  వీరితో పాటు పాఠశాల యాజమాన్యం మరియు కుటుంబ సభ్యులు శోభారాణి, విజయలక్ష్మి,కావ్య,మీన,రచన, హరితా భాను లు పాల్గొని మన తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ మన సద్దుల బతుకమ్మ అని, వీటితో పాటు అన్ని పండుగల ఉత్సవాలను చేసుకోవాలని, మన ఆచార, సంస్కృతులను ఎప్పటికీ  మరువకూడదని తెలియ చేసారు. పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయిని లు, విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేసి కన్నుల పండుగలా జరుపుకున్నారు....