Warangalvoice

Telangana

కొత్త సచివాలయానికి ముహూర్తం ఖరారు
Telangana

కొత్త సచివాలయానికి ముహూర్తం ఖరారు

ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవం: మంత్రి వేముల వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడిరచారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టిన విషయం తెలిసిందే. 50 నుంచి 200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో సచివాలయ నిర్మాణ పనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్‌ ...
శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
Cultural, Telangana

శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు

రెండురోజుల పాటు భారీగా తరలివచ్చిన నగర వాసులు ఆక్టుటకున్న బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: పల్లె సొగసులు… ప్రకృతి అందాలతో నగర ప్రజలకు ఓ గ్రావిూణ ప్రాంతంగా ఆకట్టుకుంటున్న శిల్పారామంలో సంక్రాంతి సందడి నగరవాసులను ఆకట్టుకుంది. పల్లెలకు వెళ్లలేకపోయిన పట్టణవాసులు సంక్రాంతి వేడుకలను ఇక్కడ ఆస్వాదించారు. భోగిమంటలు, రంగురంగుల రంగవల్లికలతో శిల్పారామం స్వాగతం పలుకింది. బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలతో సందడి సందడిగా మారింది. సోమ,మంగళవారాల్లో శిల్పారామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రి వరకు గంగిరెద్దు విన్యాసాలు హైలెట్‌గా నిలిచాయి., ఓ పక్క నగర వాసులు పల్లెటూర్లకు బయల్దేరి వెళ్లారు. దీంతో నగరంలో ఉన్న ప్రలకు శిల్పారామం సంక్రాంతి సంబరాలను చేరువ చేసింది. నగరంలో ఉండే తెలుగు ప్రజల సంస...
పెట్టుబడులకు అనువైన నగరంగా హైదరాబాద్‌
Telangana

పెట్టుబడులకు అనువైన నగరంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌లో సౌకర్యాలకు ప్రభుత్వం పెద్దపీట పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ఐటి ప్రతినిధుల ముఖాముఖి భేటీలో మంత్రి కెటిఆర్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడ్డ తరవాత రాష్ట్రంలో ఐటీరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. దేశంలో ఎక్కడికైనా వెళ్లివచ్చి..హైదరాబాద్‌ చూస్తే..ఇక్కడి ప్రగతి కనిపిస్తుందని అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్‌ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధుల ముఖాముఖి సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. కాళేశ్వరం ద్వారా మల్లనన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌లను నిర్మించి హై...
మా మంత్రులకు కళ్లద్దాలు ఇవ్వండి
Telangana

మా మంత్రులకు కళ్లద్దాలు ఇవ్వండి

వారు సమస్యలను చూడలేకపోతున్నారు మంత్రి ఎర్రబెల్లికి బిజెపి ప్రతినిధి రాకేశ్‌ లేఖ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ కి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌ రెడ్డి లేఖ రాశారు. తమ నగర ఎమ్మెల్యేలకు కంటివెలుగు కళ్లద్దాలు ఇప్పించండంటూ రాకేష్‌ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అందరూ కళ్లు సరిచూసుకొని, కళ్లద్దాలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్లను రాకేష్‌ రెడ్డి గుర్తు చేశారు. పనిలో పనిగా విూలాంటి కళ్లద్దాలు తమ వరంగల్‌ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, వినయ్‌ భాస్కర్‌ కి కూడా చెరో జత ఇప్పించండి మంత్రిగారు... అంటూ ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. వారికి వరంగల్‌ ప్రజలు పడుతున్న అవస్థలు ఏ మాత్రం కనిపించడం లేదని ఈ సందర్భంగా రాకేష్‌ రెడ్డి ఆరోపించారు. పైగా వరంగల్‌ దశ దిశ మారిందని ప్రచారం చేసుకుంటు న్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా మాస్టర్‌ ప్లాన్‌ లేక, అండర్‌ గ్రౌ...
క్రీడారంగానికి పెరిగిన ప్రోత్సాహం
Telangana

క్రీడారంగానికి పెరిగిన ప్రోత్సాహం

మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి గ్రావిూణ క్రీడాకారులకు పెరిగిన ఆదరణ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: క్రీడలకు సరైన ప్రోత్సహకాలు లేక ఎంతోమంది భావి క్రీడాకారులు మట్టిలో మాణిక్యాల వలే మిగిలిపోయారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు కూడా దినసరి కూలీలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాగే క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం గ్రావిూణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి శ్రీనివాసగౌడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హావిూ మేరకు క్రీడా రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించడం ద్వారా వారిలో ప్రోత్సాహాన్ని నింపారని అన్నారు. దొంగ సర్టిఫికెట్లకు అవకాశం లేకుండా నిజమైన క్రీడాకారులకు రిజర్వేషన్ల ఫలాలు దక్కేలా అన్ని శాఖలు సమిష్టి కృషి చెయ్యాలి. ఈ ఫలితాలు పొందిన క్రీడాకారులు భావి క్...
సానియా విూర్జా రిటైర్మెంట్‌ ప్రకటన
Latest News, Telangana

సానియా విూర్జా రిటైర్మెంట్‌ ప్రకటన

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా విూర్జా రిటైర్మెంట్‌ ప్రకటన చేసింది. 36 ఏండ్ల సానియా.. తను ఆడబోయే చివరి టోర్నీ ఏదో చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్‌ వేదికగా జరగబోయే డబ్ల్యూటీఏ 1000 (విమెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌) టోర్నీతో తన కెరీర్‌ కు ముగింపు పలకనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జనవరి 16 నుంచి ప్రారంభం కాబోయే ఆస్టేల్రియా ఓపెన్‌ కు సన్నధం అవుతుంది. తర్వాత దుబాయ్‌ పర్యటనకు వెళ్తుంది. అక్కడే తన రిటైర్మెంట్‌ ను ప్రకటిస్తుంది. గతేడాది ఆటనుంచి తప్పుకోవాలని అనుకున్నా.. కొన్ని కారణాలవల్ల తర్వాత తన మనసు మార్చుకుంది. పోయిన ఏడాది యూఎస్‌ ఓపెన్‌ ఆడి ఆటకు గుడబై చెప్పాలనుకుంది. కానీ, గాయం కారణంగా టోర్నీకి దూరం అయింది. దాంతో రిటైర్మెంట్‌ వాయిదా పడిరది. ’గాయంతో కెరీర్‌ ముగించుకోవాలి అనుకోలేదు. అందుకే రిటైర్మెంట్‌ ని పోస్ట్‌ పోన్‌ చేశా’ అని సానియా అన్నది....
రైతుల పాలిట రాక్షసులుగా పాలకులు !
Latest News, Telangana

రైతుల పాలిట రాక్షసులుగా పాలకులు !

వరంగల్ వాయిస్, కామారెడ్డి : కామారెడ్డి ఆందోళన రైతుల ఆక్రందనకు అద్దంపట్టే చర్య. ఇప్పుడు కామారెడ్డి ఒక్కటే కాదు... ఇంతకు ముందు మల్లన్న సాగర్‌,కొండపోచమ్మ సాగర్‌...ఫార్మాసిటీ, పోలవరం..అమరావతి, విశాఖ ఉక్కు, గంగవరం పోర్టు... ఇలా చెప్పుకుంటే పోతే అనేక చోట్ల ప్రభుత్వాల దౌర్జన్యం కనిపిస్తుంది. దోపిడీదారులుగా మారిన పాలకులు రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకుని వ్యాపారం చేస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. అభివృద్ది అన్న అందమైన పేరు చూపి భూములను గుంజుకుని బక్కరైతులను బజారున పడేస్తున్న తీరు నిరంకుశ పాలనకు సాక్ష్యంగా చూడాలి. ఎంతగా అంటే వారికి ముష్టి డబ్బులు వేసి భూములను గుంజుకుంటున్న తీరు కళ్లముందు కనబడుతున్నది. రైతులు ఆక్రందనతో ఆందోళన చేస్తుంటే పోలీస్‌ బలగాలతో వారిని అణచివేస్తున్నారు. ఇళ్లను కూడా గుంజుకుని వారిని తన్ని తరిమేస్తున్న తీరు దౌర్జన్యానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. ఎకరా 50 లక్షలు పలుకుతోంద...
యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి
Crime, District News, Telangana

యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి

దొంగనోట్ల ముఠా అరెస్ట్ నిందితులంతా ఉమ్మడి జిల్లా వారే వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరులక్షలు), కలర్ ప్రింటర్, ఏడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన సయ్యద్ యాకుబ్ ఆలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), న్యూరాయపురకు చెందిన యం.డి సమీర్ (ప్రస్తుతం పరారీలో వున్నాడు), పెద్దమ్మగడ్డకు చెందిన పేరాల అవినాష్, నర్సంపేటకు చెందిన కత్తి రమేష్, మచిలీబజార్ కు చెందిన యం.డి అక్రం ఆలీ, కాజీపేటకు చెందిన గడ్డం ప్రవీణ్, గుండ్...
సాయంలోనూ తగ్గేదేలే..
District News, Telangana, Viral News

సాయంలోనూ తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ ఔదార్యం.. డ్రైవర్ ఇంటి నిర్మాణానికి రూ.15లక్షల సాయం కమలాపూర్ వాసి, డ్రైవర్ మహిపాల్ ఇంట విరిసిన ఆనందం వరంగల్ వాయిస్, హనుమకొండ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. పాన్ ఇండియా లెవల్ లో తగ్గేదేలే.. అనే నటనతో ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. మెగా కంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డాన్స్ , డైలాగ్ డెలివరీలో తనదైన మార్క్ చూపించుకుంటున్నాడు. సినిమా సినిమాకు తన కెరీర్ ను ఉన్నతంగా మలుచుకుంటున్నాడు. ఐకాన్ స్టార్ గా వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అయితే ఈ అల్లు వారి అబ్బాయి.. నటుడిగానే కాకుండా రియల్ లైఫ్ తన మంచి మనస్సుతో అందరినీ హృదయాలను ఆకట్టుకుంటున్నాడు. అభిమానులతో పాటు తన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా సొంతింటి వారిలాగా చూసుకోవడం ఆయనకే చెల్లింది. తాను మాత్రమే బాగుండడం కాదు.. తన దగ్గర పనిచేసేవాళ్లు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్త...
సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి
Telangana, Today_banner, Top Stories

సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి

ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి.. ఎలాంటి ఆకర్షణలకు లోను కావొద్దు.. లక్ష్యాన్ని ప్రేమించి నిరంతరం శ్రమించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆర్జీయూకేటీ బాసరలో విద్యార్థులకు ఉద్బోధ ప్రస్తుత సాంకేతిక యుగంలో తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని, నిరంతరం శ్రమించిన వాడే విజేత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రేరణ కలిగించారు. శనివారం ఆర్జీయూకేటీ బాసరలో ‘ఇంజినీరింగ్ విద్య, నైపుణ్యం – భవిష్యత్తు’ అనే అంశంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. తన జీవితంలో జరిగిన ఘటనలను ఉదహరిస్తూ.. విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. పేద విద్యార్థులు కుటుంబ పరిస్థితులను తలుచుకుని కుమిలిపోవద్దని, లక్ష్యాన్ని ప్రేమించి కసితో, పట్టుదలతో చదివి గెలుపు బావుటా ఎగురవేయాలని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతీ ఇంజినీరింగ్ విద్యార్థి ఒక సృష్టికర్త, ఒక ఆవిష్...