తెలంగాణలో అద్భుత ప్రగతి
అన్నిరంగాల్లోనూ గణనీయమైన ప్రగతి
విద్యుత్, తాగు,సాగునీటి రంగాల్లో విప్లవం
దేశానికి ఆదర్శంగా నిరంతర విద్యుత్
పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణ గ్రామాలు
అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల స్వాలంబన అభివృద్ధికి కృషి
కెసిఆర్ దక్షతకు తెలంగాణ సర్వతోముఖాభివృద్ది
అసెంబ్లీ భయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగం
వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ తమిళిసై అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత, ప్రజా ప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిరదని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీటి సరఫరా జరుగుతోందని అన్నారు. ఒకప్పుడు పాడుబడిన తెలంగాణ...