Warangalvoice

Telangana

సీతారామ కళ్యాణం ..కమనీయం
Telangana

సీతారామ కళ్యాణం ..కమనీయం

  వేదోక్తంగా భద్రాచలం సీతారామ కళ్యాణం అభిజిత్‌ లగ్నంలో కళ్యావేడుకలు పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌ రెడ్డి చినజీయర్‌ స్వామి, దత్తాత్రేయ స్పీకర్‌ తమ్మినేని హాజరు వరంగల్ వాయిస్,భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండువగా సాగింది. కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతువును వేదపండితులు నిర్వహించారు. అభిజిత్‌ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. మిథులా స్టేడియం లోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీసీతారాములు కళ్యాణమండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్‌ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా ...
మహిళా జర్నలిస్టులకు హెల్త్‌ క్యాంప్‌
Telangana

మహిళా జర్నలిస్టులకు హెల్త్‌ క్యాంప్‌

శిబిరాన్ని ప్రారంభించిన సిఎస్‌ శాంతికుమారి సద్వినయోగం చేసుకోవాలని పిలుపు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌:హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌ లోని సమాచారశృాఖ కార్యాలయంలో మహిళా జర్నలిస్ట్‌ లకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెడికల్‌ క్యాంపును సీఎస్‌ శాంతి కుమారి ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో శ్వేత మహంతి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ శిబిరం మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 9 వరకు జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి మేరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. ఇంట్లో అందరి గురించి పట్టించుకునే మహిళలు వారి ఆరోగ్యంపై మరీ తీవ్రంగా ఉంటే తప్ప శ్రద్ధ పెట్టరన్నారు. మహిళలు 35 ఏళ్ల తర్వాత కచ్చితంగా జనరల్‌ హెల్త్‌ చెక్‌ అప్‌ లు చేయించుకోవాలని సీఎ...
భద్రాచలంలో కళ్యాణశోభ
Telangana

భద్రాచలంలో కళ్యాణశోభ

సీతారామ కళ్యాణానాకి భారీగా ఏర్పాట్లు వరంగల్ వాయిస్,భద్రాచలం: శ్రీసీతారామలు కళ్యాణ ఉత్సవానికి భద్రగిరి కల్యాణ శోభను సంతరించుకున్నది. ఏటా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి నేపథ్యంలో భక్తుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు. దక్షణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములోరి కల్యాణ క్రతువులో ఆ మూడు రోజులే కీలక ఘట్టాలు. అలాంటి మధుర ఘట్టాలను తిలకించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 30న జరగనున్న రామయ్య కల్యాణానికి వేదికను ముస్తాబు చేసారు.వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఏటా రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు తరలి రానున్నారు. గురువారం రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. సుప్రభాత సేవ,తిరువారా...
షర్మిల నివాసం లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత
Telangana

షర్మిల నివాసం లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత

ఉస్మానియాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ షర్మిల వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ఉస్మానియాలో రోగులను పరామర్శించేందుకు వెళుతున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల నివాసం లోటస్‌ పాండ్‌ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికని బయలుదేరిన వైఎస్‌ఆర్టీపీ చీఫ్‌ షర్మిలను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని షర్మిల, పోలీసులను కోరారు. పోలీసుల వాహనంలో తీసుకెళ్లినా పర్వాలేదని వేడుకున్నారు. తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరమర్శిస్తానని షర్మిల స్పష్టం చేశారు. వెళ్ళనివ్వద్దని పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు. అనంతరం విూడియాతో మాట్లాడిన ఆమె.. ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్డులో వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. రూ.200...
కెసిఆర్‌ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
Political, Telangana

కెసిఆర్‌ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

అభివృద్దికి నమూనా తెలంగాణ బిజెపి విమర్శలను తిప్పికొట్టాల్సిందే: వేముల   వరంగల్ వాయిస్,నిజామాబాద్‌: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కడతారని, మరోమారు తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానేనని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. తెలంగాణతో పాటు, దేశంలోనూ బిజెపికి ప్రజలు వాతలు పెటట్డం ఖాయమని అన్నారు. తెలంగాణ అభివృద్ది ముందు మోడీ నిలవలేరని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, బిజెపి నాటకాలను కూడా ఎండగట్టాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధిస్తుందని, ఎగిరేది గులాబీ జెండేనని చెప్పారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడంతో తెలంగాణ రైస్‌ బౌల్‌గా మారిందన్నారు. నీటి సరఫరాతో ధాన్యాగారంగా మారిందన్నారు. వడ్లను కొనే దమ్ముకూడా బిజెపి ప్రభుత్వానికి ల...
అందుబాటులోకి లగ్జర్టీ బస్సులు
Telangana

అందుబాటులోకి లగ్జర్టీ బస్సులు

లాంఛనంగా ప్రారంభించిన పువ్వాడ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 16 ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులకు ’లహరి` అమ్మఒడి అనుభూతి’గా ఆర్టీసీ నామకరణం చేసింది. సోమవారం ఈ కొత్త బస్సులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తదితరుల సమక్షంలో ఈ బస్సులను టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లిÑ ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతిÑ తమిళనాడులోని చెన్నై తదితర ప్రధాన మార్గాల్లో నూతన ఏసీ స్లీపర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడపనుంది. 12 విూటర్ల పొడవు గల ఏసీ స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర...
మహారాష్ట్ర వేదికగా బిజెపికి సవాల్‌
Telangana

మహారాష్ట్ర వేదికగా బిజెపికి సవాల్‌

తెలంగాణ రైతు పథకాలపై చర్చకు ఆస్కారం దమ్ముంటే అమలు చేయాలన్న కెసిఆర్‌ లోహా సభతో మరాఠ్వాడాలో బిఆర్‌ఎస్‌కు ఆదరణ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ స్థాపించిన తరవాత మహారాష్ట్రలో కెసిఆర్‌ నిర్వహించి మలి సభ భారీ విజయం సాధించింది. దీంతో అక్కడి, ఇక్కడి బిఆర్‌ఎస్‌ నేతల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనా మహారాష్ట్రలో మెల్లగా అగ్గి రాజేయడం ద్వారా బిఆర్‌ఎస్‌ చర్చకు తెరలేపింది. అంతేగాకుండా మహారాష్ట్ర వేదికగా బిజెపికి సవాల్‌ విసిరినట్లు అయ్యింది. తెలంగాణ పతకాలను ప్రస్తావి స్తూ వాటిని అమలు చేసే దమ్ముందా అని కెసిఆర్‌ ప్రశ్నించారు. ఇది ఓ రకంగా బిజెపి పాలకులకు సవాల్‌ కానుంది. ప్రజల్లో చర్చకు రానుంది. కంధార్‌ లోహాలో ఆదివారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన రెండో సభతో ప్రత్యా మ్నాయం తామే అన్న చర్చకు తెరతీసారు.ప్రలోభాలను, పోలీసుల ఆంక్షల్ని దాటి అశేషంగా జనం తరలి రావడం వి...
రాహుల్‌పై అనర్హత వేటు దారుణం
Telangana

రాహుల్‌పై అనర్హత వేటు దారుణం

బిజెపి దాష్టీకాలకు పరాకాష్ట : ఇంద్రకరణ్‌ నిర్మల్‌: రాహుల్‌ గాంధీపై పార్లమెంట్‌ అనర్హత వేటువేయడాన్ని అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. బిజెపి దాష్టీకాలు పెరిగాయని, విపక్ష పార్లీలపై కక్షసాధింపు ధోరణితోకేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నిర్మల్‌ నియోజకవర్గం సోన్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించే గొంతు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని ఆరోపించారు. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల లోపే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం దారుణమన్నారు. ఇది అప్రజాస్వామికమని ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని ఆన్నారు. ఇలాంటి అమానుష చర్యలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండిరచాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు Ñ సొన్‌ మండల కేంద్రంలో ని రాజ రాజ...
బండి సంజయ్‌కు మారోమారు నోటీసులు
Telangana, Top Stories

బండి సంజయ్‌కు మారోమారు నోటీసులు

లీగల్‌గా చర్చిస్తామన్న బండి సంజయ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: బండి సంజయ్‌కు మరోసారి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇంటికి శనివారం ఉదయం సిట్‌ అధికారులు చేరుకున్నారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్‌ నోటీసులపై స్పందించిన బండి సంజయ్‌.. విచారణకు హాజరుకావాలా.. లేదా అనే అంశంపై తమ లీగల్‌ టీంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్‌ కు కట్టుబడి ఉన్నానని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో నమ్మలేని నిజాలున్నాయన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మూడు రోజుల క్రితం కూడా సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరై వివరాలు అందించాలని నోటీసుల్లో పేర్కొంది. బండి సంజయ్‌ తన నివాసంలో లేకపోవడంతో అక్కడే నోటీసులను అధికారులు అతికించారు. గ్రూప్‌`1లో బీఆర్‌ఎస్‌ నేతల పి...
కెటిఆర్‌ రాజీనామా చేయాలి..
Political, Telangana, Today_banner, Top Stories

కెటిఆర్‌ రాజీనామా చేయాలి..

లేదంటే బర్తరఫ్‌ చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ డిమాండ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్‌ పీఎస్‌ సీ పేపర్‌ లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. దోషలును తేల్చడంతో పాటు, కెటిఆర్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మరోమారు తెరవిూదకు తెచ్చారు. అదే సందర్భంలో నిరుద్యోగులకు కనీసం లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న బండి సంజయ్‌.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పేపర్‌ లీక్‌ కేసులో విచారణ జాప్యం చేస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని .. లేకపోతే భర్తరఫ్‌ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.పేపర్‌ లీక్‌ కేసులో ఇద్దరే నిందితులన్న కే...