Warangalvoice

Telangana

ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే కుట్ర
Political, Telangana

ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే కుట్ర

బండి సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి మంత్రులు జగదీశ్‌ రెడ్డి, గంగుల డిమాండ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీలో రాజకీయ అన్నారు. పశ్నాపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తప్పుచేసి అడ్డంగా దొరికినప్పటికీ సంజయ్‌ని ఆ పార్టీ నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌లోకి చోచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్‌ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు.పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్‌ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ క్షుద్రాజకీయ క్రీడకు తెరలేపిందని చెప...
ప్రశ్నపత్రాల లీక్‌.. కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు
Telangana

ప్రశ్నపత్రాల లీక్‌.. కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

వరంగల్ వాయిస్,హైదరాబాద్: తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో భాజపా నాయకులు చెలగాటమాడుతున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు.. తదనంతర పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం. కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం’’ అని కేటీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.  ...
బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు
Telangana

బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు

కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్‌ ను అర్ధరాత్రి అకారణంగా, అక్రమంగా అరెస్ట్‌ చేసి ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ… అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి అవినీతి, అక్రమాలు బయటపడకుండా ఆపలేరన్నారు. అయినా తమ పోరాటం ఆగదన్నారు. గతంలో తీన్మార్‌ మల్లన్న, అంతకు ముందు రఘు.. ఇలా ప్రశ్నించిన జర్నలిస్టులను కూడా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు లీకేజీలు, మరోవైపు ప్యాకేజీలు.. ఇది బయటపడకుండా ఉండడం కోసమే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు లీకేజీ కారణంగా ఆగమయ్యాయని తెలిపారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం కోసమే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారన్నారు. పార్లమెంట్‌ వే...
వరంగల్‌లో హిందీ టెన్త్‌ పేపర్‌ లీక్‌
Telangana

వరంగల్‌లో హిందీ టెన్త్‌ పేపర్‌ లీక్‌

వాట్సాప్‌ గ్రూపుల్లో ఉదయమే ప్రత్యక్షం లీక్‌ కాదని సమర్థించుకున్న డిఇవో లీక్‌ వార్తలపై చర్య తీసుకోవాలని మంత్రి సబిత ఆదేశం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణలో క్వశ్చన్‌ పేపర్‌ లీక్స్‌ కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్‌ లీక్స్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు పేపర్‌ లీక్‌ అయిన విషయం తెలిసిందే. రెండు రోజు మంగళవారం కూడా హిందీ పేపర్‌ లీక్‌ అవ్వడం పెను సంచలనానికి దారితీసింది. హిందీపేపర్‌ లీక్‌తో తెలంగాణ పదోతరగతి పరీక్షలు రెండోరోజూ వార్తల్లోకి వచ్చాయి. తొలిరోజు వికారాబాద్‌ జిల్లా తాండూరులో తెలుగు పేపర్‌ లీక్‌ అవ్వగా.. మంగళవారం వరంగల్‌ జిల్లాలో హిందీ పేపర్‌ లీక్‌ అయింది. హిందీ క్వశ్చన్‌ పేపర్‌ ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్‌ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ ...
ధాన్యం కొనుగోళ్లలో వెనకడుగు లేదు
Telangana

ధాన్యం కొనుగోళ్లలో వెనకడుగు లేదు

కేంద్రం సహకరించకున్నా ముందుకే పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ వరంగల్ వాయిస్,కరీంనగర్‌: వరి ధాన్యం కొనుగోలు విషయంలో సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్లనే రైతులకు మేలు జరుగుతోందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కేంద్రం మొండికేసినా రాష్ట్రంలో చివరిగింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్రమంత్రి పేర్కొన్నారు. కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌ ముందే రైతులకు సూచించారన్నారు. వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు విడిచిపెట్టలేదన్నారు. యాసంగి ధాన్యాన్ని నేరుగా కేంద్రమే కొనుగోలు చేయాలని అన్నారు. కేంద్రం ధాన్యం కొనకపోయినా గత కొన్నేళ్లుగా తామే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కేంద్రం...
కూల్‌రూఫ్‌ పాలసీతో తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు
Telangana

కూల్‌రూఫ్‌ పాలసీతో తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు

భవనాలకు కూల్‌రూఫ్‌తో మంచి ప్రయోజనాలు ప్రజల్లో విస్తృతంతగా ప్రచారం చేయాలి కూల్‌రూఫ్‌ పాలసీ విడుదల సందర్భంగా కెటిఆర్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ రూఫ్‌ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇది భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. ఇంటితోపాటు, గోడలను కూల్‌రూఫ్‌ ఉంచుకుంటే విద్యుత్‌ వినియోగం కూడా తగ్గుతుందన్నారు. మొదట తమ ఇంటిపై కూల్‌ రూఫ్‌ విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ సీడీఎంఏ ఆఫీస్‌లో కూల్‌రూఫ్‌ విధానంపై ఆయన మాట్లాడారు. భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీ 2023`28ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశం మొత్తంలోనే హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ...
తెలుగు రాష్టాల్ల్రో టెన్త్‌ పరీక్షలు ప్రారంభం
Telangana

తెలుగు రాష్టాల్ల్రో టెన్త్‌ పరీక్షలు ప్రారంభం

టెన్త పరీక్షా కేంద్రాలవద్ద కోలాహలం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలుగు రాష్టాల్ల్రో పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ లో ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఆరు పేపర్లతోనే టెన్త్‌ పరీక్షలను ఎస్‌ఎస్‌స్సీ బోర్డు నిర్వహించనుంది. ఏప్రిల్‌ 3 నుండి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఉదయం 9:35 గంటల వరకు విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనమతించారు. పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 2652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం విద్యార్థుల్లో అబ్బాయిలు 2,43,852, అమ్మాయిలు 2,41,974 ఉన్నారు. అలాగే 3,78,794 మంది విద్యార్థులు ఇంగ్లీష్‌ విూడియంలో పరీక్ష రాయనుండగా.. 98,726 మంది విద్యార్థులు తెలుగు విూడియంలో పరీక్ష ర...
Telangana

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి

అధికార పార్టీకి సవాల్‌ విసిరేలా నేతల దూకుడు ఎదురుదాడి ప్రచారం లో ముందున్న బిఆర్‌ఎస్‌ కెసిఆర్‌పై నియంత పాలన అంటూ విమర్శలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీలు అన్నీ అప్పుడే ప్రచారంలోకి దిగాయా అన్న సందేహం వస్తోంది. అధికార బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ బిజెపిలు కత్తులు నూరుతున్నాయి. అయితే వీరికన్నా ముందే బిఆర్‌ఎస్‌ బిజెపిని ఎండగడుతూ సిలిండర్‌ను చూపుతూ ప్రచారం చేస్తోంది. ప్రధానంగా గ్యాస్‌, పెట్రో ధరలనే హైలెట్‌ చేస్తోంది. కులాల వారీగా, వర్గాలవారీగా, వృత్తుల వారీగా, సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆకట్టుకుంటున్నారు. పతకాల్లో ప్రభుత్వం జోరు పెంచింది. ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలంతా బిఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మంత్రులు,ఎమ్‌ఎల్యేలు, ఇతర నేతలు అంతా నియోజకవర్గాల్లోనే మకాం వేసి ...
ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి
Telangana

ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి

స్వాగత ర్యాలీలో గుండెపోటుతో బిఆర్‌ఎస్‌ నేత మృతి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని నరేందర్‌ మృతికి కవిత నివాళి వరంగల్ వాయిస్,జగిత్యాల: జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ బండారి రజినీ భర్త నరేందర్‌ గుండెపోటుతో మృతి చెందారు.జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు డీజేలతో డ్యాన్స్‌ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్‌ చేస్తున్న బండారి నరేందర్‌ ఒక్క సారిగా కుప్పకూలారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు సీపీఆర్‌ చేసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేందర్‌ మృతి చెందారు. దీంతో పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. నరేందర్‌ మృతితో జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేశారు. నరేందర్‌ మృతిపట్ల సంతాపం ...
స్కూటీని ఢీకొన్న రాజధాని బస్సు
Telangana

స్కూటీని ఢీకొన్న రాజధాని బస్సు

మంటల్లో బస్సు, స్కూటీ దగ్ధం ఘటనలో ఒకరు మృతి వరంగల్ వాయిస్,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్‌ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న స్కూటీని ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు స్కూటీని ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. స్కూటీ, బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. ఒకరు మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నారు. మృతుడు ఇందిరానగర్‌కు చెందిన రాజు(45)గా గుర్తించడం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రాజధాని బస్సు వెళుతోంది. మియాపూర్‌ డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు. మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర ఘటన జరిగింది. కాగా.. నిన్న ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సులో సైతం ప్రమ...